హైదరాబాద్: సినిమా ఇండస్ట్రీలో రాజమౌళితప్ప అందరం ఏదో ఒక తప్పు చేస్తుంటామని దర్శకుడు వీవీ వినాయక్ అన్నారు. అఖిల్ సినిమాతో మొదటిసారిగా తాను తప్పు చేసినట్లు అనిపించిందని చెప్పారు. త్వరలో మంచి హిట్‌తో అభిమానుల ముందుకు వస్తానని వినాయక్ అన్నారు.
వినాయక్ నిన్న ఏలూరులో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ, అఖిల్ సినిమా విషయంలో అభిమానులు, సినిమా కుటుంబ సభ్యులు క్షమించాలని, మరోసారి అటువంటి తప్పు జరగకుండా చూసుకుంటానని చెప్పారు. కథ కొత్తగా ఉందని అఖిల్‌తో ఆ సినిమా తీశానని అన్నారు. హీరోగా అఖిల్ ఎంతో ప్రతిభ చూపినప్పటికీ సినిమా ఆశించిన ఫలితం ఇవ్వలేదని చెప్పారు. సినిమా విడుదల తర్వాత సినీ ప్రతినిధుల వల్ల చిత్రం టాక్ తెలుస్తుందని, సినిమా కుటుంబంలో వారి సేవలు ఎంతో గొప్పవని అన్నారు. ఏలూరు పట్టణంలో సినీ రిప్రజంటేటివ్స్‌కు వినాయక్ చేతుల మీదగా ఎల్ఐసీ బాండ్ల పంపిణీ జరిగింది. తక్కువ జీతంతో విధులు నిర్వహించే రిప్రజంటేటివ్స్‌కు చివరికి ఎలాంటి ఆధారం లేకుండా పోయిందని వినాయక్ అన్నారు. సన్నిహితుడు సీతారామ్ అనే వ్యక్తి రిప్రజంటేటివ్స్‌కు ఉచితంగా ఎల్ఐసీ పాలసీ చేయించాలని చెప్పటంతో కొందరి సాయంతో చేయింటినట్లు తెలిపారు. 53 మంది రిప్రజంటేటివ్స్‌కు బాండ్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉషా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ బాలకృష్ణ, అంబికా కృష్ణ, ఎల్వీఆర్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు.