లోకేష్ డిప్యూటీ సీఎం అనే నినాదానికి టీడీపీలో అనూహ్యంగా మద్దతు లభిస్తోంది. పలువురు సీనియర్ నేతలు లోకేష్ కు ఆ హోదా కల్పించడం సముచితం అని వాదిస్తున్నారు. ఈ మేరకు బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు. తాజాగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సోషల్ మీడియాలో ఇదే ప్రకటన చేశారు. ఈ ప్రతిపాదనను తాను సమర్థిస్తున్నానని తెలిపారు. చంద్రబాబు కడప పర్యటనలో రెడ్డప్పగారి శ్రీనివాసులరెడ్డి ఈ మాట అన్నారు. ఇప్పుడు సోమిరెడ్డి మద్దతు పలికారు.
ఇక టీడీపీలో రోజుకో వాయిస్ లోకేష్‌కు డిప్యూటీ సీఎంహోదా గురించి మాట్లాడే అవకాశం ఉంది. ఇది అంత మంచి పద్దతి కాదు అనుకుంటే హైకమాండ్ .. ఆ అంశంపై మాట్లాడవద్దని హైకమాండ్ అనే వరకూ స్పందించే అవకాశం ఉంది. మార్చిలో మంత్రివర్గంలో మార్పు చేర్పులు ఉంటాయన్న ప్రచారం జరుగుతోంది. నాగబాబుతో ప్రమాణం చేయిస్తారు. అదే సమయంలో లోకేష్ తో కూడా డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయించాలన్న డిమాండ్ పెరిగే అవకాశం ఉంది.
అసలు ఈ అంశంలో చంద్రబాబు ఆలోచన ఏమిటన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతంపార్టీ అంతా లోకేష్ గ్రిప్ లోనే ఉంటోంది. అందుకే సీనియర్ నేతలు.. లోకేష్ కు మద్దతు ప్రకటిస్తున్నారు. ఆయన తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నారని అంటున్నారు. నిజానికి లోకేష్ పదేళ్ల కాలంలో ఎక్కువగా కష్టపడ్డారు. కానీ పెద్దల కోసం వెనక్కి తగ్గారు. ఇప్పుడు అలా చేయడం తప్పు కాకూడదని.. ముందుకు రావాలని పార్టీ నేతలు సలహాలిస్తున్నారు. మరి జరుగుతుందా?