ఏపీ బీజే్పీ అధ్యక్షుడు సోము వీర్రాజు పార్టీలో తన వర్గం మాత్రమే ఉండాలనుకుంటున్నారు. తనకు వ్యతిరేక వర్గం లేదా తాను నియమించని వారు ఎవరైనా ఉంటే వెంటనే తొలగిస్తున్నారు. ప్రస్తుతం ఆయన వరుసగా జిల్లాల అధ్యక్షుల్ని తొలగిస్తున్నారు. వీరంతా కన్నా లక్ష్మినారాయణ అధ్యక్షుడుగా ఉండగా నియమించిన వారే. వారిని ఎందుకు తొలగిస్తున్నారో స్పష్టత లేదు. ఎవరితోనూ సంప్రదింపులు జరపడం లేదు. కానీ తొలగించి ఇతరులకు ఇస్తున్నారు. దీంతో కన్నా ఒక్క సారిగా ఫైరయ్యారు.
సోము వీర్రాజు ఏకపక్షంగా చేస్తున్న తొలగింపుల కారణంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. ఆ పార్టలోని ఇతర స్థాయిలో ఉన్న నేతలు కూడా రాజీనామాలు చేస్తున్నారు. ఈ లేఖలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారు. దీంతో ఏపీ బీజేపీలో ఏం జరుగుతోందన్న చర్చ ప్రారంభమయింది. కన్నా లక్ష్మినారాయణను టార్గెట్ చేసి ఆయనను బయటకు పంపేదుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారని అందుకే ఆయన అనుచరులుగా ముద్రపడిన వారందర్నీ పార్టీ పదవుల నుంచి తొలగిస్తున్నారని అంటున్నారు.
ప్రస్తుతం జాతీయ కార్యవర్గంలో ఏపీ నుంచి ఉన్న ఒకే ఒక్క నేత కన్నా లక్ష్మినారాయణ ఒక్కరే. అయినా ఆయన మాటకు విలువ లేకుండా పోయింది. కన్నా చీఫ్ గా ఉన్నప్పుడు ప్రభుత్వంపై.. అవినీతిపై పోరాడారు. కానీ సోము వీర్రాజు వచ్చాక అంతా సైలెంట్ అయిపోయింది. ఇప్పుడు కన్నాను పార్టీ నుంచి పంపేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. కన్నా జనసేనలో చేరుతారని సోము వర్గం విస్తృతంగా ప్రచారం చేస్తోంది.