ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్రమైన భూకబ్జా ఆరోపణల్లో ఇరుక్కున్నారు. అదీ కూడా ఆయన దళితుల భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఆ పార్టీ నాయకుడు లక్ష్మీపతి రాజా, వల్లభనేని సుధాకర్ లు మంగళగిరి ఎన్ఆర్ఐ కాలేజీకి సమీపంలో దళితులకు చెందిన ఆరు ఎకరాల భూమిని తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. రిజిస్ట్రేషన్ అయితే జరిగిందని. .. దీనికి ప్రభుత్వ పెద్దల సాయం కూడా ఉందన్న ప్రచారం జరుగుతోంది.
ఈ అంశంపై దళితులు నిరసనలు ప్రారంభించాు. సోము వీర్రాజుకు వ్యతిరేకంగా దళితులు విజయవాడలో ఆందోళనకు దిగారు. విజయవాడలో జరుగుతున్న పుస్తక మహోత్సవం కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సోముకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించారు. అయితే పోలీసులు వారి ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో కిషన్ రెడ్డి కారును అడ్డుకుని సోముకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే కిషన్ రెడ్డి పట్టించుకోలేదు.
సోము వీర్రాజు కు వ్యతిరేకంగా ఈ నెల 18న ఏపీ బీజేపీ కార్యాలయ ముట్టడికి దళిత సంఘాలు పిలుపు ఇచ్చాయి. బీజేపీ రాష్ట్ర కార్యాలయం పేరుతో ఇప్పటికే పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడుతున్నారని అంటున్నారు. ఈ అంశంపై సోము వీర్రాజు ఇంకా స్పందించలేదు. ఆ ఆరు ఎకరాల దళితుల భూములకు సంబంధించిన డాక్యుమెంట్లు బయటకు వస్తేనే.. సోము వీర్రాజు వ్యవహారం లో క్లారిటీ వస్తుందని బీజేపీ వర్గాలంటున్నాయి. దీనిపై అంతా మౌనం పాటిస్తూండటంతో. . ఏదో గూడుపుఠాణి ఉందని ఎక్కువ మంది నమ్ముతున్నారు.