ఆంధ్ర ప్రదేశ్ బిజెపి అద్యక్షపదవి తనకు దక్కకుండా పోవడానికి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కారణమని సోము వీర్రాజు ప్రస్టేషన్లో వున్నారు. ఆ ధుగ్ధతోనే వెంకయ్యను ఇరకాటంలో పెట్టేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై ఆయన దాడి చేస్తున్నారు. ఇది బిజెపి నేతల అంతర్గత వాక్కు. నోటిదురుసుకు మారుపేరైన సోము వీర్రాజును అద్యక్షుడిని చేయడం మొదటికే మోసమని బిజెపి కేంద్ర నాయకత్వం నిర్ణయానికి వచ్చారట.అది ఆయనకూ తెలిసిపోయి ఇంతగా నోరు పారేసుకుంటున్నారన్నమాట. వాస్తవానికి వెంకయ్యపై చాలా వ్యాఖ్యలు వచ్చినా యథావిధిగా మళ్లీ తన స్థానం నిలబెట్టుకున్నారు. తెలంగాణలో డా.కె.లక్ష్మణ్ అద్యక్షుడు కావడానికి వెనక కూడా ఆయనే వున్నారంటారు. దానికి తగినట్టే ఇప్పుడు తెలంగాణలో వెంకయ్యపై దాడి తగ్గింది. రాజ్యసభ ఎన్నికల్లోనూ తెలుగుదేశంతో వరస కుదిరినట్టే కనిపిస్తుంది. పరిస్థితి బాగాలేనప్పుడు నోరున్న సోమువీర్రాజులు కావాలి గాని అంతా సర్దుకున్నాక వారే సమస్యలు తెచ్చిపెడతారు కదా! సో… నో సోము…