బీజేపీ అధ్యక్షుడిగా హైకమాండ్ నియమించిన తర్వాత సోము వీర్రాజు ఆత్రానికి హద్దే లేకుండా పోతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బీజేపీని ఇట్టే బలపరచాలన్న లక్ష్యంతో ఆయన వేస్తున్న అడుగులు నవ్వుల పాలు చేస్తున్నాయి. అందర్నీ మైండ్‌గేమ్‌తో పార్టీలో చేర్చుకోవాలని ఆయన తాపత్రయ పడిపోతున్నారు. అందులో భాగంగా తాను గురి పెట్టిన వారిపై సోషల్ మీడియాలో ప్రచారాలు చేయించేందుకు వెనుకాడటం లేదు. తాజాగా.. నిన్నామొన్నటిదాకా ఏపీ టీడీపీ అధ్యక్షునిగా ఉన్న మాజీ మంత్రి కళా వెంకటరావును.. మాజీ మంత్రి పడాల అరుణను సోము వీర్రాజు కలుస్తారని పత్రికా ప్రకటన వచ్చింది. కళా వెంకటరావు పేరు .. సోము వీర్రాజు వెల్లడించడంతో టీడీపీలో కలకలం రేపింది.
శ్రీకాకుళం జిల్లాలోసీనియర్ నేతగా ఉన్న ఆయన మాజీ మంత్రి కూడా. అచ్చెన్నను నియమించే వరకూ ఏపీ టీడీపీ అధ్యక్షుడు. ఆయన పార్టీ మారతారంటే..సహజంగానే టీడీపీకి షాక్ లాంటిది. అయితే… కాసేపటికే.. ఆయన నుంచి రివర్స్ రిప్లయ్ ఇచ్చింది. కోపం వచ్చినా గౌరవంగానే… సోము వీర్రాజుకు కౌంటర్ ఇచ్చారు. వెంటనే సోము వీర్రాజు..కళా వెంకటరావును తాను కలవడం లేదని పొరపాటున ఆయన పేరును పత్రికా ప్రకటనలో చెప్పాల్సి వచ్చిందని వివరణ ఇచ్చుకున్నారు. సోము వీర్రాజు.. శనివారం ముద్రగడతో సమావేశం అవుతారు. అయితే.. దానికి హైప్ రావడం కోసం.. ఇతర పార్టీ నేతల్ని కూడా కలిపేశారన్నచర్చ జరుగుతోంది.
సోము వీర్రాజు.. తాను పార్టీలోకి పెద్ద ఎత్తున నేతల్ని తీసుకొస్తానని హైకమాండ్‌కు హామీ ఇచ్చారేమో కానీ.. ఆయన అదే పనిగా… ఇతరుల్ని కలవడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. చివరికి చెన్నై వెళ్లి వాణీ విశ్వనాథ్, ప్రియారామన్‌ను కలవాలనుకున్నారు. ఇద్దరూ అంగీకరించినా.. చివరికి సోము వీర్రాజు చెన్నై వెళ్లిన తర్వాత ప్రియారామన్ హ్యాండిచ్చారు. వాణివిశ్వనాథ్ ఏమీ చెప్పకుండా పంపేశారు. ఏపీలోనూ అంతే. ఆయన నాయకత్వంలో చేరేందుకు ఏ ఇతర పార్టీ నేతలూ ముందుకు రావడం లేదు. గతంలో కన్నా హయాంలో చేరిన నేతల్ని బయటకు పంపేయడం… జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా వ్యవహరిస్తూండటంతో.. ఆయనతో చేరితే తమ రాజకీయభవిష్యత్ పాడైపోతుందన్న భయంలో ఉన్నారు.
అయితే సోము వీర్రాజు మాత్రం…. ఇతర పార్టీల నేతలపై దుష్ప్రచారం చేస్తూ.. అదే మైండ్ గేమ్ అనుకుటూ.. తన వంతు ప్రయత్నాలు తాను చేసుకుంటున్నారు. గతంలో గంటా శ్రీనివాస్‌తో భేటీ అయి… ఆయన ఇంటి ముందే… పార్టీలో చేరికలు ఉంటాయని చెప్పుకొచ్చారు. ఇప్పుడు కళా వెంకట్రావుతో భేటీ కాక ముందే ఆయన బీజేపీలో చేరుతున్నట్లుగామీడియాలో ప్రచారం అయ్యేలా చేశారు. అయితే.. ఎవరైనా కంట్రోల్ తప్పి ఈ ప్రచారంపై విమర్శలు చేస్తే పరువు పోతుందని బీజేపీలోని సోము వ్యతిరేకులు మండి పడుతున్నారు.