ఎమ్మెల్సీగా ఎన్నికయినా సోము వీర్రాజు కేసీఆర్ పై పట్టలేనంత కోపం వచ్చింది. బీజేపీ నేతల్ని గంటనక్కలు అన్నాడని.. కేసీఆరే పెద్ద గుంట నక్క అని విమర్శించారు. ఆయన రాత్రి పూట సరిగా నిద్ర పోవడంలేదని, కేసీఆర్ తన కుమార్తె కవిత, కుమారుడు కేటీఆర్, మేనల్లుడు హరీష్ రావుల కోసం ఆలోచిస్తున్నారని, వారి కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారని అన్నారు. కేసీఆర్ తెలంగాణ ప్రజలకు కళ్లబొ్ల్లి కబుర్లు చెప్పి పదేళ్లు తెలంగాణను పాలించారుని సోము వీర్రాజు విమర్శించారు.
డీలిమిటేషన్ పై ఆరోపణలు చేస్తూ మోదీకి జగన్ లేఖ రాయడాన్ని సోము వీర్రాజు తప్పు పట్టారు. ఏపీలోని జగన్ పార్టీ లేకుండా చేస్తామన్నారు. 40 శాతం ఓట్లు వచ్చాయంటున్నారని వాటిని నాలుగు శాతం ఓట్లకు తీసుకెళ్తమని చాలెంజ్ చేశారు. ఇప్పుడు ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే సభకు వస్తానంటున్నాడని 2014లో ప్రతిపక్ష నేత హోదా ఉన్న సరే సభకు వెళ్లలేదని సోము వీర్రాజు గుర్తు చేశారు.
సోము వీర్రాజు ఇటీవలి కాలంలో వరకూ సైలెంటుగా ఉన్నారు. ఇప్పుడు ఆయనకు కూటమి కోటాలో బీజేపీ తరపున ఎమ్మెల్సీగా చాన్స్ వచ్చింది. అందుకే పార్టీ కోసం మాట సాయం చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు ఎమ్మెల్సీ కూడా కావడంతో ఆయన మాటలకు కాస్త వెయిట్ ఉంటుంది. అందుకే మీడియా కనిపిస్తే చాలు విమర్శలు ప్రారంభిస్తున్నారు.