సోము వీర్రాజుకు చీప్ లిక్కర్ హామీతో వచ్చిన పబ్లిసిటీతో మైండ్ బ్లాంక్ అయిందో లేకపోతే అదేదో బాగుందని అనుకుంటున్నారో కానీ ఎనీ ఐటమ్.. బిలో ఫిఫ్టీ అనే హామీని ఇచ్చేస్తున్నారు. ఏ నిత్యావసర వస్తువు అయినా చీప్ లిక్కర్ కంటే తక్కువకే ఇస్తామన్నట్లుగా ఆయన ప్రకటన చేస్తున్నారు. చీప్ లిక్కర్ అంశంపై తన పై ట్రోలింగ్ ఆగలేదు. ముందుగా పెట్రోల్, డీజిల్ నిత్యావసర వస్తవుల ధరల సంగతి చూడాలని.. అధికారంలో ఉండి ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. దీంతో సోము వీర్రాజు మరోసారి ప్రెస్మీట్ పెట్టి.. చీప్ లిక్కర్ కన్నా చీప్గానే సన్నబియ్యం ఇస్తామని ప్రకటించేశారు.
సన్నబియ్యం కిలో 40రూపాయల కు వినియోగదారుల కు అందిస్తామని.. అదే విధంగా టమోటా, ఉల్లి వంటి కూరగాయల ధరలు ్లాగే సబ్సు,పేస్ట్ తో సహ ఇతర వస్తువుల ధరలను కూడా తగ్గిస్తామని ప్రకటించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ వీటిని తగ్గించడానికి ఎందుకు చర్యలు తీసుకోలేకపోయింది అన్న ప్రశ్నలు వచ్చి పడతాయని తెలిసినా సోము వీర్రాజు ఇలాంటి హామీలు ఇవ్వడానికి ఏ మాత్రం వెనుకాడలేదు. బహుశా సీఎం జగన్ సినిమా టిక్కెట్లతో పాటు ఇతర అంశాల్లో ఇచ్చినట్లుగా.. ఇంతకే అమ్మాలని జీవోలు జారీ చేస్తారేమోనని కొంత మంది సెటైర్లు వేస్తున్నారు.
2024 తర్వాత రాజకీయాల్లో ఉండనని రిటైర్మెంట్ ముందుగానే ప్రకటించిన వీర్రాజు జనం సానుభూతితో ఒక్క చాన్స్ ఇస్తే ఏదో అయిపోదామని ఆశ పడుతున్నారు. అందుకే లిక్కర్ దగ్గర్నుంచి అన్నీ నోటికొచ్చిన హామీలు ఇస్తున్నారని అంటున్నారు. మొత్తంగా చూస్తే సోము వీర్రాజు ఈ ఆత్రంతో ఉన్న పదవికే ఎసరు పెట్టుకుంటారేమోనన్న చర్చ నడుస్తోంది.