కేంద్ర బీజేపీ నేతలు తెలంగాణపై పెట్టినంత ఫోకస్ ఏపీపై పెట్టడం లేదు. బహుశా తెలంగాణలో పట్టు చిక్కిన తర్వాత ఏపీపై పెడతారమో కానీ ఇప్పుడైతే.. ఏదో మొక్కుబడి పర్యటనలు చేస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో పొత్తులపై విస్తృతమైన చర్చ జరుగుతోంది. బీజేపీతో పొత్తులో ఉన్న పవన్ కల్యాణ్ ఆ పార్టీతో కనిపించడం లేదు. బయటకు మాత్రం బీజేపీతో సంబంధాలు బాగున్నాయంటున్నారు కానీ జనసేన నేతలెవరూ బీజేపీతో కలిసి రాజకీయాలు మాట్లాడుతున్నట్లు కానీ.. చేస్తున్నట్లుగా కానీ లేదు. కానీప్రకటనలు మాత్రం బీజేపీ జనసేనతోనే వెళ్తుంతని చెబుతున్నారు.
ఇప్పుడు ఈ పొత్తులపై ఢిల్లీ నేతలే క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. వచ్చే నెల మొదటి వారంలో జేపీ నడ్డాను ఏపీకి ఆహ్వానించాలని సోము వీర్రాజు భావిస్తున్నారు. రాజమండ్రిలో బహిరంగసభ పెట్టి పవన్ కల్యాణ్ ను లేదా … జనసేన కీలక నేతల్ని కూడా ఆహ్వానించి తమ పొత్తు బలంగా ఉందని నిరూపించాలన్న ప్రయత్నంలో ఉన్నారు. నడ్డా, అమిత్ షా లాంటి నేతలు వస్తే పవన్ కల్యాణ్ వస్తారని.. సోము వీర్రాజు భావిస్తున్నారు. అందుకే సోము ఈ వ్యూహం అమలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.
ఒక వేళ పవన్ లేదా జనసేన సభలకు .. పిలిచినా జనసేన హాజరు కాకపోతే.. పొత్తు విషయంలో చాలా తేడా ఉన్నట్లే అనుకోవాలి. ఓట్లు చీలనివ్వబోమని పవన్ కల్యాణ్ పదే పదే చెబుతున్నారు. ఓటు బ్యాంక్ లేని బీజేపీతో ఉండటం వల్ల పోటీ చేయడం వల్ల ఓట్లు చీలకడమే తప్ప.. మిగిలిదేం ఉండదని పవన్ కు క్లారిటీ ఉంది. అయితే రాజకీయాల విషయంలో సోము వీర్రాజు అండ్ బృందానికి ఖచ్చితమైన అభిప్రాయాలున్నాయి. దీంతో మారుతున్న పొత్తుల రాజకీయాల్ని వారు మార్చాలని తెగ ప్రయత్నం చేస్తున్నారు. ఎంత వరకు సక్సెస్ అవుతారో చూడాలి.