మెగా మేనల్లుడు సాయి తేజ్ లేటెస్ట్ సినిమా చిత్రలహరి. ఈ సినిమాలో గ్లాస్ గొప్పదనం కీర్తిస్తూ ఓ పాట వుందట. గ్లాస్ అనగానే మెగాభిమానులకు ఇప్పుడు గుర్తుకు వచ్చేంది జనసేన సింబల్ గాజు గ్లాస్ మాత్రమే. చిత్రలహరిలో యాదృచ్ఛికంగా కావచ్చు, గ్లాస్ మేట్స్ అన్న పాట ఒకటి వుందట. శైలజ..శైలజ..అన్న పాట టైపులో సాగే మాస్ పాట అంట ఇది.
క్లాస్ మేట్స్ కన్నా గ్లాస్ మేట్స్ మిన్న అనే టైపు సాంగ్. పాట వింటే ‘గ్లాసు’ అభిమానులు ఆనందపడోచ్చు కానీ, జనసేన పార్టీ కోసం మాత్రం ఈ పాట ఉపయోగపడదని తెలుస్తోంది. ఎందుకంటే ఇక్కడ గ్లాస్ మేట్స్ అంటే మందుబాబులు అన్నమాట. బాగా తాగేద్దాం, తాగేసి చిందేద్దాం..చిందేసి పడిపోదాం అనే టైపులో సాగే పాట ఇది.
అందువల్ల గ్లాస్ పాట అన్నంత వరకు ఓకె కానీ జనసేన పార్టీకి మాత్రం ఉపయోగపడదట. కానీ మాస్ మెగాభిమానులు మాత్రం తమ పార్టీ గుర్తును తలుచుకుంటూ, ఈ పాట పాడుకుని మురిసిపోవడం వరకు మాత్రం పనికి వస్తుందని తెలుస్తోంది. ఈనెల మూడోవారంలో ఈపాట విడుదల చేస్తారు. అప్పుడు చూడాలి మరి ఎలా వుంటుందో వ్యవహారం.