ఏ రోటి కాడ ఆ పాట పాడే వైఖరి ముందు ముందు ఇబ్బందులు తెచ్చి పెడుతుందనే సత్యం సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న సోనియా కు తెలియని సంగతేమీ కాదు. అయితే తమిళనాట అంతకు మించి ఆమెకు తమ కూటమి హామీల్లో మరొక మంచి సంగతి కనిపించలేదేమో గానీ , ఇక్కడ మద్యనిషేధం పాట పాడి కొత్త గుదిబండను మెడకు తగిలించుకున్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఈ విషయంలో తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన అగత్యంలో పడ్డారు.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచార హామీల్లో మద్యనిషేధం కీలక పాత్ర పోషిస్తున్నది. సంపూర్ణ మద్యనిషేధం గురించి డీఎంకే, కాంగ్రెస్ కూటమి ఇప్పటికే చెప్పింది. తాజాగా ప్రచారానికి వచ్చిన సోనియా కు ఇదొక్కటే నచిందేమో గానీ, ఆ విషయం పై సీఎం జయలలితకు సవాలు విసురుతున్నారు. ఆమె తన విధానం ఏమిటో స్పష్టం చేయాలంటున్నారు.
జయలలిత అనేక జనకర్షక పథకాలు ప్రకటించిన నేపథ్యంలో సోనియాకు వేరే గత్యంతరం లేకుండా పోయింది.
కానీ, జాతీయ పార్టీ నేతగా తను ఈ మాట చెబితే, తమ పార్టీ పాలనలో ఉన్న రాష్ట్రాల్లో గొడవ అవుతుందని ఆమె గుర్తించినట్లు లేదు. అందుకే తానుగా ఆమె మధ్య నిషేధం గుదిబండను మెడకు తగిలించుకున్నట్లు అయిందని పలువురు విశ్లేషిస్తున్నారు.