నేషనల్ హెరాల్డ్ ఆస్థుల కొనుగోళ్లకు సంబందించి సోనియా, రాహుల్‌లు ఆర్ధిక అక్రమాలకు పాల్పడ్డారంటూ భారతీయజనతా పార్టీ నాయకుడు సుభ్రమణ్యస్వామి వేసిన కేసు వారిద్దరిమెడకు చుట్టుకొని ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబందించి సుప్రీంకోర్టులో స్వయంగా అప్పీలు చేసుకోవడం ద్వారా ఊరట పోందాలన్న సోనియా గాందీకి ఆమె కొడుకు రాహుల్‌కు నిరాశే ఎదురైంది. తమను ఈ కేసు విచారణనుంచి తప్పించాలని కోరుతూ వారు వేసిన పిటీషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. కేసు విచారణ యదావిధిగా సాగుతుంది. విధిగా రావల్సిందే నంటూ సుప్రీంకోర్టు తెలిపింది. అయితే గుడ్డిలో మెల్ల ఏంటంటే సోనియా రాహుల్‌లు వ్యక్తిగతంగా ఈ కేసుకు విచారణకు హజరుకావాల్సిన అవసరం లేదంటూ సుప్రీంకోర్టు ఊరట కలిగించింది. సోనియా, రాహుల్‌లు ఇద్దరు నేషనల్ హెరాల్డ్ ఆస్థుల కొనుగోళ్లు వ్యవహారంలో ఆర్ధిక వ్యవహారాలకు సంబందించినట్లుగా సుభ్రమణ్యస్వామి కొంత కాలం నుంచి కేసు నడుపుతున్నారు. మళ్లీ ఈ మద్య తల్లీ కొడుకులు ఇద్దరు వ్యక్తిగతంగా హైకోర్టుకు హాజరైన సంగతి తెలిసిందే. ఆరోజు దేశానికి బ్లాక్‌డే అన్నట్లుగా ఉద్యమం నడపడానికి కాంగ్రెస్‌పార్టీ విపలయత్నం కూడా చేసింది. నిజానికి ఈ ఆస్తుల కొనుగోలు వ్యవహారంలో తల్లీ కొడుకుల ఇద్దరితో పాటు మరికొందరు వృద్దా సినియర్ కాంగ్రెస్‌నాయకుల హస్తం కూడా ఉండటం గమనార్హం. అయితే వారందరి సంగతి ఎలా ఉన్నప్పటికీనీ మీ ఇద్దరిని మాత్రం విచారణ నుంచి తప్పించాలని కోరుతూ వీల్లు సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు. అదికాస్త తిరస్కరణకు గురైంది. ఈనెల 20 తేదీన ట్రైల్ కోర్టులో దీనికి సంబందించిన విచారణ జరగనుంది. అయితే వీరిద్దరూ నేరుగా హాజరు కావలసిన అవసరం లేకుండా కోర్టు కొద్దిగా దయ పెట్టినట్లే కనిపిస్తోంది.
వ్యక్తిగతంగా హాజరుకావల్సిన అవసరంలేదనీ సుప్రీంకోర్టు చెప్పడంలో కూడా వారికి పూర్తి స్తాయి ఊరట కనిపించినట్లుగా లేదు. వారి వలన విచారణకు ఇబ్బందిగా ఉంటుంది గనుక మాత్రమే ఇలాంటి ఏర్పాట్లు చేస్తున్నట్లు తాజాగా సుప్రీంకోర్టు పేర్కోన్నది తప్పా, న్యాయస్థానం తదనుగుణంగా భావిస్తున్నయితే వారి వ్యక్తిగత హాజరు అవసరం అని భావిస్తే ఆ మేరకు వారిద్దరిని పురమాయించి, కోర్టుకు నేరుగా పిలిపించవచ్చుననీ కూడా సుప్రీంకోర్టు చెప్పడం విశేషం.