కడప పులిగా పేరు తెచ్చుకున్న పోలీస్ ఆఫీసర్ ఉమేష్ చంద్ర. నిజాయతీగా మారుపేరుగా నిలిచిన..ఉమేష్ చంద్ర… నక్సలైట్ల చేతుల్లో దారుణ హత్యకు గురయ్యాడు. కడప జిల్లా ఎస్పీగా పనిచేసిన ఉమేష్ చంద్ర నిసెప్టెంబరు 4, 1999లో హైదరాబాద్ నడి రోడ్డుపై నక్సలైట్లు కాల్చి చంపారు. పోలీస్ చరిత్రలో అదో దుర్దినంగా నిలిచింది. మరుసటి యేడాది ఉమేష్ చంద్రని ఎక్కడైతే కాల్చి చంపారో, అక్కడే… ఆయన విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఎస్.ఆర్ నగర్ కూడలిలో ఆ విగ్రహం ఇప్పటికీ వుంది. తన జీవితమంతా.. పోరాటమే. సవాళ్లకు ఎదురొడ్డి నిలిచిన ఘన చరిత్ర.. ఉమేష్ చంద్రది. ఇప్పుడు అతని కథ తెరపైకి వస్తోంది. ఉమేష్ చంద్ర పాత్రలో సోనూసూద్ నటించబోతున్నాడని ఇన్ సైడ్ వర్గాల టాక్. ఇప్పటికే స్క్రిప్టు రెడీ అయిపోయిందని, ఈ సినిమాలో నటించడానికి సోనూసూద్ అంగీకారం తెలిపాడని సమాచారం. త్వరలోనే… ఈ సినిమాకి సంబంధించిన ఓ అధికారిక ప్రకటన వస్తుంది.