అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ప్రముఖ గాయకుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం.. ఈరోజు మరింత క్షీణించింది. ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉందని సమాచారం. కాసేపట్లో వైద్యులు హైల్త్ బుటిటెన్ ని విడుదల చేయనున్నారు. అందులో ఏం చెబుతారో అని బాలు అభిమానులు ఆందోళనతో ఎదురు చూస్తున్నారు. నిజానికి బాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఆయన లేచి కూర్చుంటున్నారని, ఆహారాన్ని కూడా తీసుకుంటున్నారని చెప్పారు. అంతలోనే బాలు ఆరోగ్య సమస్యలు మళ్లీ తిరగబడ్డాయి. వైద్యానికి ఆయన స్పందించడం లేదని, ఆయన శరీరంలో భాగాలు అదుపు తప్పాయని ఇన్సైడ్ వర్గాలు చెప్పాయి. దాంతో.. ఆయన అభిమానులు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.