ప్రముఖ గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం తల్లి శకుంతలమ్మ తుది శ్వాస విడిచారు. ఈరోజు ఉదయం 7 గంటలకు నెల్లూరులో ఆమె కన్ను మూశారు. ఆమె వయసు 87 సంవత్సరాలు. గత కొంతకాలంగా శకుంతలమ్మ అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం బాలు లండన్ లో ఉన్నారు. తల్లి మరణవార్త తెలియగానే హుటాహుటిన బయల్దేరారు. రేపు నెల్లూరులోనే అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.