ప్రముఖ గాయకుడు ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉంది. ఆయన్ని వెంటలేటర్పైనే ఉంచి చికిత్స అందిస్తున్నారు. మరో రెండు రోజుల పాటు బాలుని ఐసీయూలోనే ఉంచుతామని వైద్యులు తెలిపారు. ఆయనకు ప్లాస్మా అందించామని, మరో రెండు రోజులు వెంటిలేటర్ పైనే ఉండాల్సివస్తుందని, చికిత్సకు ఆయన బాగా స్పందిస్తున్నారని చెప్పారు. మరోవైపు బాలు ఆసుపత్రి ఖర్చులన్నీ మేమే భరిస్తామని తమిళనాడు ప్రభుత్వం ముందుకొచ్చింది. బాలు ఆరోగ్య పరిస్థితిని ప్రభుత్వ అధికారులు, మంత్రులు ఎప్పటికప్పుడు తెలసుకుంటూనే ఉన్నారు. ఈనెల 5న కోవిడ్ బారీన పడిన బాలు…. వెంటనే ఆసుపత్రిలో చేరారు. తొలుత ఆయన ఆరోగ్యం బాగానే ఉంది. అయితే ఒక్కసారిగా బాలు ఆరోగ్యం క్షీణంచడంతో ఐసీయూలో చేర్పించారు.