ఆగస్టు 5న ఆసుపత్రిలో చేరిన బాలు.. సెప్టెంబరు 25న శాశ్వత నిద్రోకి జారుకున్నారు. అంటే బాలు సరిగ్గా 51 రోజులు ఆసుపత్రి చికిత్స నిమిత్తం ఉండాల్సివచ్చింది. ఆ 51 రోజులూ ఎలా గడిచాయి? బాలు కాలక్షేపం ఏమిటి? ఆయనకు ఏ తరహా చికిత్స అందించారు? ఈ విషయాలపై ఎంజీఎం ఆసుపత్రి వర్గాలు కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పాయి.
5 వ తేదీన కరోనాతో సోకినప్పుడు… బాలులో కోవిడ్ లక్షణాలు చాలా స్వల్పంగానే కనిపించాయి. వారం రోజుల క్వారెంటైన్ తరవాత.. ఆయన్ని ఇంటికి పంపించాలనుకున్నారు. కానీ.. రోజులు గడిచే కొద్దీ.. పరిస్థితులు క్లిష్టంగా మారాయి. ఆయనకు శ్వాస కోస సంబంధమైన సమస్యలు తలెత్తడంతో ఆక్సిజన్ సిలెండర్‌ని అమర్చాల్సి వచ్చింది. అది మరింత తీవ్ర తరం కావడంతో.. 13 నుంచి ఎక్మో ట్రీట్ మెంట్ మొదలైంది. కొన్ని రోజులకు ప్మాస్లా థెరఫీ మొదలైంది. మరోవైపు ఫిజియో ధెరపీ కూడా జరిగేది. ఆక్సిజన్ లెవిల్స్ పెరగడానికి నిపుణులైన వైద్య బృందం తీవ్రంగా కృషి చేసింది. బాలుని కంటికి రెప్పలా కాపాడుకోవడానికి 24 గంటలూ షిఫ్టుల చెప్పున నలుగురు వైద్య సిబ్బంది ఉండేవారు. వీరి ట్రీట్మెంట్, చేసిన సేవ బాలుకి ఎంతగా నచ్చిందంటే మాట్లాడని స్థితిలో కూడా ఓ కాగితంపై `లవ్ యూ ఆల్` అంటూ రాసిచ్చి తన కృతజ్ఞతల్ని తెలిపార్ట బాలు.
ఆక్సిజన్ సిలెండర్లు పెట్టినా, శ్వాస తీసుకోవడంతో ఇబ్బంది తలెల్తడంతో.. మెడకు చిన్న రంథ్రం చేయడం కోసం చిన్న సర్జరీ చేయాల్సివచ్చింది. బాలు ఎక్కువగా సంగీతం వినేవారు. లలిత సహస్రనామం వింటూ కాలక్షేపం చేశారు. బాలుకి క్రికెట్ అంటే చాలా ఇష్టం. సీపీఎల్ మ్యాచ్‌లను ఆయన మిస్ అవ్వకుండా చూశార్ట. ఐపీఎల్ లో ఒకట్రెండు మ్యాచ్‌లను బాలు చూశారు. ఇళయరాజాకి సంబంధించిన ఓ వీడియో చూసి, ఆయన భావోద్వేగానికి గురైనట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
మెల్లమెల్లగా ఆయన ఆరోగ్యం కుదుట పడింది. మనుషుల్ని గుర్తించడం మొదలెట్టారు. నోటి ద్వారా ఘన ఆహారం తీసుకోవడం మొదలైంది. ఈనెల 5న పెళ్లి రోజు కూడా చేసుకున్నారు. అయితే.. సడన్‌గా పరిస్థితులో మళ్లీ మార్పులొచ్చాయి. సిటీ స్కాన్‌లో మెదడులో రక్తస్రావాన్ని డాక్టర్లు గుర్తించారు.క్రమంగా మెదడులో రక్తం గడ్డకట్టుకుని పోయింది. దాంతో పాటు శ్వాస కోస సమస్యలు ఎక్కువ అవ్వడంతో బాలు కన్నుమూశారు.