ఆంధ్రప్రదేశ్‌లో ఐఏఎస్ అధికారులు గ్రూపులుగా మారిపోయారు. వచ్చే ప్రభుత్వంలో ప్రాధాన్య పోస్టులు పొందాలన్న ఉద్దేసమో.. మరో కారణమో కానీ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేసేందుకు కొంత మంది సిద్దమయ్యారు. అది.. అధికారిక వ్యవహారాల్లో మాత్రమే కాదు… బయట కూడా.. అదే పని చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల సంఘం .. చీఫ్ సెక్రటరీగా.. ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని నియమించడంతో వివాదం ప్రారంభమయింది. జగన్ అక్రమాస్తుల కేసులో సహ నిందితుడైన… ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని సీఎస్‌ను ఎలా చేస్తారని… చంద్రబాబు చేసిన విమర్శలపై… ఆయనకు మద్దతుగా.. కొంత మందిని కూడగట్టాలనే ప్రయత్నాలు చురుగ్గా చేస్తున్నారు. ఈ మేరకు.. కొంత మంది ఐఏఎస్ అధికారులతో… మాజీ సీఎస్‌లు కొందరు సంప్రదింపులు జరిపారన్న ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై ఐ ఏ ఎస్ అధికారుల సంఘం అసంతృప్తి వ్యక్తం చేయాలన్న ఒత్తిడిని తీసుకొస్తున్నారు.
ఈ మేరకు సమావేశం పెట్టాలని మూడు రోజులుగా…ఒత్తిడి తెస్తున్నారు. ఏ రోజుకు ఆ రోజు.. ఈ రోజు సమావేశం ఉంటుందని.. మీడియాకు లీకులు ఇస్తున్నారు కానీ కావడం లేదు. దీంతో.. కొంత మంది ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని… ఐఏఎస్ అధికారుల సంఘం సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది.
చీఫ్ సెక్రెటరీని ఉద్దేశించి సీఎం చంద్ర బాబు చేసిన వ్యాఖ్యలను ఖండించాలని నిర్ణయించినట్లు సమాచారం.
విజయవాడ బరం పార్క్ లో ఐఏఎస్ అధికారుల సంఘం భేటీ అయ్యే అవకాశం ఉంది.
ఐఏఎస్ అధికారులకు సమా వేశ నికి రావాలని సమాచారం పంపారు. అయితే ఈ సమావేశానికి ఎంత మంది ఐఏఎస్ అధికారులు వెళ్తారనేది ఆసక్తికరంగా మారింది.
రాజకీయంగా ఇప్పటికే.. ఐఏఎస్ అధికారులపై అనేక విమర్శలు వస్తున్నాయని.. ఇప్పుడు కొత్తగా.. మరో వివాదం ఎందుకన్న ఉద్దేశంలో కొంత మంది ఐఏఎస్ అధికారులు ఉన్నారు. అయితే ప్రభుత్వం మారితే.. ప్రాధాన్య పోస్టులు దక్కుతాయన్న ఉద్దేశంతో.. కొంత మంది ఐఏఎస్ అధికారులు మాత్రం… ముఖ్యమంత్రి వ్యాఖ్యలను ఖండించడానికి సిద్ధమవుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. రాజకీయాలు పార్టీల మధ్యనే కాదు.. అధికారుల గ్రూపుల్లోనూ ఉంటున్నాయని.. తాజా పరిణామాలు చూస్తే నిరూపితమవుతోందని… అమరావతిలో గుసగుసలు వినిపిస్తున్నాయి.