ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసినా వరుసగా మూడు సెషన్లకు స్పీకర్ అనుమతి తీసుకోకుండా డుమ్మా కొడితే.. అనర్హతా వేటు వేసేందుకు స్పీకర్‌కు సర్వాధికారాలు ఉంటాయి. సెలవు పెట్టకుండా అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటు వేయడం..నియమాలు, సంప్రదాయాలకు సంబంధించినవి. వరుసగా మూడు సెషన్లకు రాకపోతే అనర్హతా వేటు వేయవచ్చని నిబంధనలున్నాయని గతంలో స్పీకర్ గా ఉన్నప్పుడు కోడెల శివప్రసాదరావు ప్రకటించారు.
అయితే ఇప్పటి వరకూ దేశంలో అసెంబ్లీకి హాజరు కాకపోవడం వల్ల ఎవరిపైనా అనర్హతా వేటుపడలేదు. స్పీకర్ దగ్గర అనుమతి తీసుకుంటే అనర్హతా వేటు నుంచి తప్పించుకోవచ్చు. అంటే స్కూల్ పిల్లలు సెలవు చీటి పెట్టినట్లుగా పెట్టుకోవచ్చు. లీవ్ లెటర్ పెట్టుకుంటే ఇస్తారు కానీ దాని వల్ల రాజకీయంగా విమర్శలు వస్తాయి.
అసెంబ్లీ సెషన్స్ రాకపోతే.. నిబంధనల ప్రకారం అనర్హతా వేటు వేసే అవకాశం వస్తే.. టీడీపీ ఖచ్చితంగా ఉపయోగించుకుంటుందన్న అంచనాలు ఉన్నాయి. ఆ నిర్ణయాన్ని కోర్టుల్లో కూడా సవాల్ చేయలేరు. శాసన వ్యవస్థకు సంబంధించి స్పీకర్ అత్యంత పవర్ ఫుల్ . ఆయన నిర్ణయమే ఫైనల్. మూడు, నాలుగు సెషన్లు చూసి… అంటే ఒకటి, రెండేళ్ల తర్వాత పరిస్థితిని బట్టి టీడీపీ వ్యూహాత్మక అడుగుులు వేసే అవకాశం ఉంది.