మూడేళ్ల కిందట రాజీనామా చేసిన గంటా శ్రీనివాసరావు రాజీనామా లేఖ .. ఎన్నికల షెడ్యూల్ వచ్చే ముందు స్పీకర్ కు కనిపించింది. గంటా వివరణ కూడా అడగకుండా ఆమోదించేశారు. కానీ ఆళ్ల రామకృష్ణారెడ్డి చేసిన రాజీనామా మాత్రం స్పీకర్‌కు కనిపించలేదు. ఆయన స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా సమర్పించారు. కానీ స్పీకర్ ఇంకా పరిగణనలోకి తీసకోలేదు. ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజ్యసభ ఎన్నికల్లో వైసీపీకే ఓటు వేస్తారన్న నమ్మకంతోనే ఆయన రాజీనామా జోలికి పోవడం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది.
స్పీకర్ ఒక పార్టీకి చెందినప్పటికీ.. నిర్ణయాలు తీసుకునే విషయంలో స్పీకర్ వద్ద రాజీనామాలు పెండింగ్ లో ఉంటే.. అన్నింటి విషయంలో ఒకే సారి నిర్ణయం తీసుకుంటారు. కానీ ఇప్పుడు మాత్రం .. పార్టీలను బట్టి నిర్ణయం తీసుకుంటున్నారు. గంటా రాజీనామాను ఆమోదించిన తర్వాత.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. నిజానికి టీడీపీలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలను వైసీపీ సస్పెండ్ చేసింది. అందుకే అనర్హతా అనే మాట రాదు. కానీ.. వైసీపీ నేతలు ఫిర్యాదు చేశారు.
స్పీకర్ పరిగణనలోకి తీసుకున్నారు. వారికి నోటీసులు జారీ చేశారు. అలాగే టీడీపీ నుంచి వైసీపీలో చేరిన వారికీ నోటీసులు జారీ చేశారు. కానీ వారి విషయంలో స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని అనుకోవడం లేదు. స్పీకర్ పూర్తిగా వన్ సైడ్ నిర్ణయాలు తీసుకుటూ… విలువల్ని పూర్తిగా దిగజారుస్తున్నారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు.