స్పీకర్గా ఓ సమావేశంలో పాల్గొనడానికి ఉత్తరాదికి వెళ్లికి తమ్మినేని సీతారాంను… ఏపీ భవన్ అధికారులు కనీసం గౌరవించలేదు. ఆయనకు.. రూం కేటాయించి… డబ్బులు వసూలు చేశారు. ఇచ్చిన మంచినీళ్ల బాటిళ్లు, పెట్టిన టిఫిన్లకు కూడా.. జీఎస్టీతో సహా.. బిల్లు రాశారు. స్పీకర్గా అపరిమితమైన అధికారాలు ఉన్నా ఆయన… సతీసమేతంగా… ఉత్తరాది పర్యటనకు వెళ్లారు. భార్య ముందే.. ఇలా .. స్పీకర్ హోదాలో ఉన్న తనను.. ఏపీ భవన్ లోని చిన్న స్థాయి అధికారులు బిల్లు కట్టాల్సిందేనని చెప్పడంతో.. ఆయన ఫీల్ అయ్యారు. విషయం పెద్దది చేయడం ఇష్టం లేక… వెంటనే బిల్లు కట్టేశారు. అయితే.. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలని ఆయన అనుకోవడం లేదు. ఏపీ భవన్ అధికారులపై… సీరియస్ యాక్షన్ తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరే అవకాశం ఉంది.
నిజానికి ఏపీ భవన్లో.. స్టేట్ గెస్ట్ హోదాలో ఎవరు వచ్చినా.. సకల సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత అక్కడి అధికారులకు ఉంది. ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి… తెలంగాణ క్యాడర్లోనే ఉన్నారు. కానీ ఆమె.. స్టేట్ గెస్ట్ లా… రూపాయి కట్టకుండా… ఏపీ భవన్లోనే మకాం వేశారు. ఆమెకు.. విజయసాయిరెడ్డి అండదండలుఉన్నాయి. అందుకే.. ఏపీ భవన్ అధికారులు.. ఒక్క మాట కూడా.. మాట్లాడకుండా.. ఆమెకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు. కానీ.. నిజంగా.. స్టేట్ గెస్ట్ అయిన సీతారాంను మాత్రం అధికారులు అవమానపరిచారు. బిల్లు కట్టించుకున్నారు.
ఏపీ భవన్ అధికారులు.. ప్రభుత్వంలో ఉన్న వారు ఎవరు వచ్చినా… ప్రోటోకాల్ పాటించరు. ప్రభుత్వ పెద్దలకు సన్నిహితులైన వారికి మాత్రమే.. ఆ సౌకర్యం కల్పిస్తారు. వారు అధికార పదవుల్లో ఉన్నారా.. లేదా అన్నదానిపై.. వారికి సంబంధం లేదు. ప్రభుత్వ పెద్దలతో సాన్నిహిత్యం ఉండటమే.. వారికి పదవి. ఈ విషయంలో.. తమ్మినేని సీతారాంను.. ప్రభుత్వ పెద్దలకు సన్నిహితులు కాదని.. ఏపీ భవన్ అధికారులు ఎందుకు అనుకున్నారో మరి..!