కోట్ల మంది ప్రజల స్వప్నం తెలంగాణ రాష్ట్రం. దాన్ని నిజం చేసి చూపించారు కేసీఆర్. తెలంగాణ సాధకునిగా చరిత్రలో నిలిచిపోయిన ఆయన ఇప్పుడు దేశాన్ని టార్గెట్ గా పెట్టుకున్నారు. రాజకీయాలు చాలా మంది గెలుపోటములుగా చూస్తారని తనకు మాత్రం టాస్క్ అని ఆయన చెబుతున్నారు. తెలంగాణను ఎనిమిదేళ్లలోనే కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేశానని.. అదే మోడల్‌తో దేశాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో ఆయన జాతీయ రాజకీయాలు ప్రారంభించారు. తన రాజకీయ జీవితాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లిన టీఆర్ఎస్ పార్టీని కూడా ఆయన బీఆర్ఎస్గా మార్చారు. కవచకుండలం లాంటి తెలంగాణ సెంటిమెంట్ ను కూడా వదులుకున్నారు.
కేసీఆర్ రాజకీయ ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రాజకీయాల్లో ఆయన వ్యూహాలు … ఆయన అడుగులు… ఎవరూ ఊహించని విధంగా ఉంటాయి. తన మాటలే మంత్రంగా ఆయన చేసే రాజకీయాలు తెలంగాణ ప్రజల్ని కట్టి పడేస్తాయి.. కేసీఆర్ అసెంబ్లీలో చెప్పినట్లుగా రిటైరయ్యే దశలో కొత్త టాస్క్ ఎంచుకున్నారు. దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయడానికి వెళ్తున్నారు. కేసీఆర్ రాజకీయ జీవితాన్ని పరిశీలించిన వారికి ఆయనను తక్కువ అంచనా వేయలేరు. ఎందుకంటే అసాధ్యం అనుకున్న పనులెన్నో ఆయన చేసి చూపించారు. అందుకే… అన్నీ వ్యతిరేకంగా కనిపిస్తున్నా.. బీఆర్ఎస్ కనీస ఇతర రాష్ట్రాల్లో అభ్యర్థులను నిలబెట్టగలదా అనే డౌట్స్ ఉన్నా… అక్కడ ఉంది కేసీఆర్ అనే కంక్లూజన్‌కు వస్తున్నారు.
తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ పాలనలో తెలంగాణ అభివృద్ధి చెందిందన్నది కళ్ల ముందు కనిపించే నిజం. ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడానికి .. రైతులకు అండగా నిలబడటానికి ఆయన శక్తివంచన లేకుండా ప్రయత్నించారు. ఆయన చేసే రాజకీయాల విషయంలో చాలా మందికి భిన్నాభిప్రాయాలు ఉండంవచ్చు కానీ.. తెలంగాణ ప్రయోజనాల విషయంలో ఆయన చిత్తుశుద్ధిని ఇతర పార్టీల నేతలు కూడా శంకించరు. రాజకీయాలకు.. అభివృద్ధికి ఎప్పుడూ ముడిపెట్టలేదు. చేయాల్సిన పని చేస్తూనే… ఆయన రాజకీయంగా ముందుకెళ్తున్నారు.
కేసీఆర్ రాజకీయ జీవితంలో ప్రతీ పుట్టిన రోజుకూ ఓ టాస్క్ ఉంటుంది. ఎప్పటికప్పుడు అది సవాల్ గానే ఉంటుంది. దాన్ని ఆయన సింపుల్‌గా అధిగమిస్తూ వస్తున్నారు. ఈ పుట్టిన రోజుకు ఆయన ఒకటి కంటే ఎక్కువ టాస్కులు ఉన్నాయి . ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలవడంతో పాటు .. బీఆర్ఎస్ పార్టీని జాతీయ స్థాయిలో విస్తరించాల్సి ఉంది. వచ్చే పుట్టినరోజు నాటికి ఆయన మూడో సారి సీఎంగా పదవిలో ఉంటే… జాతీయ రాజకీయాల్లలో ఆయన సూపర్ స్టార్‌గానే ఉంటారనడంలో సందేహం లేదు. ఈ ఫీట్ ఆయన సాధించగలరు కూడా !