జగన్ అక్రమాస్తుల కేసుల విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు ప్రత్యేక విజ్ఞప్తిని సుప్రీంకోర్టుకు సీబీఐ చేసింది. అపిడవిట్ దాఖలు చేసింది. జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ 12 ఏళ్లుగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఇప్పటివరకు 39 క్వాష్ పిటిషన్లు, 95 డిశ్చార్జి పిటిషన్లు దాఖలు అయ్యాయి. వాటిని విచారణ జరుపుతున్న జడ్జిలు మధ్యలో బదిలీ అవుతున్నారు. ఫలితం గా కేసు విచారణ మొదటికి వస్తోంది. ఇదే విషయాన్ని అఫిడవిట్ రూపంలో సీబీఐ .. సుప్రీంకోర్టుకు తెలిపింది.
జగన్ అక్రమాస్తుల శక్తిమంతులేనని సీబీఐ పేర్కొంది. ఏదో ఒక కారణంతో ఒక దాని తర్వాత ఒక కేసు దాఖలు చేస్తూ దేశంలో అత్యుత్తమ న్యాయవాదులను పెట్టి వాదనలు వినిపిసూ కేసులను ముందుకు సాగనీయడం లేదన్నారు. ఒక ప్రిన్సిపల్ కోర్టుకు ఈ కేసుల రోజువారీ విచారణ బాధ్యతలు అప్పగించాలని సుప్రీంకోర్టుకు విజ్ఞప్తి చేసింది. ఇందులో 911 మంది సాక్షులున్నారని, అంతా 50 ఏళ్లు పైబడిన వారేనని తెలిపింది. వేరే రాష్ట్రానికి బదిలీచేయవద్దని కోరింది.
జగన్ అక్రమాస్తుల కేసును తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని ఎంపి రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన ఎస్ఎల్పి విచారణలో భాగంగా సీబీఐ అఫిడవిట్ దాఖలు చేసింది.
సుప్రీంకోర్టు ఆదేశంతో జగన్ అక్రమాస్తుల కేసులో ట్రయల్ కోర్టులో జరుగుతున్న వ్యవహారాన్ని దర్యాప్తు సంస్థ ధర్మాసనం ముందు ఉంచింది. జగన్ అక్రమాస్తుల కేసులో చివరి ఛార్జిషీటు 2013లో దాఖలైంది. ఇప్పటి వరకూ ట్రయల్ ప్రారంభం కాలేదు. సుప్రీంకోర్టు నిర్ణయించుకుంటే.. స్పెషల్ కోర్టు ఏర్పాటయ్యే అవకాశం ఉంది.