తెలంగాణలో మరోసారి బీఆర్ఎస్కు అధికారాన్ని అప్పగిస్తే.. ముస్లిం యువత కోసం ప్రత్యేకంగా ఓ ఐటీ పార్క్ ను హైదరాబాద్ శివార్లలో నిర్మిస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఎన్నికలు అంటే అనేక హామీలు అసువుగా వచ్చేస్తాయి. చేస్తామా..చేయగలమా అనే ఆలోచన రాజకీయ నేతలకు ఉండదు. అయితే ఇలాంటి బిజారే హామీలు ఇచ్చినప్పుడే కాస్తంత వైరల్ అవుతూంటాయి. ఐటీ పార్కులు పెడితే.. ఐటీ రంగంలో భిన్నమైన ఫోర్ట్ ఫోలియోల కోసం పెడతారేమో కానీ కులాలు, మతాల ఆధారంగా పెడతారా అని అందరూ బుగ్గలు నొక్కుకుంటున్నారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగాల్లో ఇప్పటిక ముస్లింలు ఉన్నారు.
రిజర్వేషన్లు లేవు. ప్రతిభ ఆధారంగా ఐటీ ఉద్యోగాలను పొందుతున్నారు. పెద్ద ఎత్తున ముస్లిం యువత కూడా ఉపాధి పొందుతున్నారు. మరి ప్రత్యేకంగా ముస్లింల కోసం ఐటీ ాపర్క్ ను కేసీఆర్ ఎలా నిర్మిస్తారన్నది ఇండస్ట్రీ వర్గాలను సైతం ఆశ్చర్య పరుస్తోంది. ఓ ఐటీ పార్క్ కట్టి.. అక్కడ ముస్లింలకు మాత్రమే స్పేస్ ఇస్తామని. ముస్లింలకు మాత్రమే ఉద్యోగాలివ్వాలని చెబుతారేమోనని కొంత మంది అంటున్నారు.
అయితే ఈ ప్రకటన కేసీఆర్ చేశారని. మిగతా అన్ని కులాలకు హాస్టల్స్ , భవన్స్ నిర్మిస్తామని హామీ ఇచ్చినట్లుగానే..ఐటీ పార్క్ హామీ ఇచ్చి ఉంటారని కొంత మంది సర్దిచెప్పుకుంటున్నారు. కేటీఆర్ ఈ హామీపై ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ కేసీఆర్ మాత్రం ఆషామాషీగా అనలేదని.. ముస్లిం యువతను ఆకట్టుకునేందుకే ఇలాంటి ప్రకటన చేశారని నమ్ముతున్నారు.