ఏపీ, బీహార్‌లకు ఈ సారి కేంద్ర బడ్జెట్లో ప్రత్యేక సాయం ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. అయితే రెండు రాష్ట్రాలకే ఇస్తే రాజకీయ కారణాల ఇచ్చారని విమర్శలు వస్తాయి కాబట్టి.. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ట్రాలతో పాటు రాజకీయ ప్రయోజనాలను చూసుకుని జార్ఖండ్, ఛత్తీస్‌ఘడ్, ఒడిషా, జమ్మూ కశ్మీర్ వంటి రాష్ట్రాలకు ప్రత్యేక కేటాయింపులు ప్రకటించే అవకాశాలు ఉన్నాయని ఢిల్లీలో ప్రచారం ఊపందుకుంటోంది.
చంద్రబాబునాయుడు ఇటీవలి కాలంలో రెండు సార్లు ఢిల్లీకి వెళ్లి రాష్ట్రానికి కావాల్సిన వాటిపై ప్రజెంటేషన్ ఇచ్చారు. నేరుగా నగదు బదిలీ ఇవ్వగలిగిన అవకాశాలతోపాటు.. ఇతర మార్గాల ద్వారా ఎలా రాష్ట్రానికి ప్రయోజనం కల్పించవచ్చో చెప్పి వచ్చారు. ఆయన చెప్పినంత ఇవ్వకపోవచ్చు కానీ ఎంతో కొంత ఊరటనిస్తారని గట్టిగా నమ్ముతున్నారు. కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు టీడీపీ నిర్ణయం కీలకమైనప్పుడు చంద్రబాబు ఏ మాత్రం సంకోచించకుండా ఎన్డీఏ తప్ప మరో చాయిస్ లేదన్నారు. ఆయన స్థిరమైన నిర్ణయం … స్థిరమైన ప్రభుత్వానికి దారి తీసింది.
పదవులు కూడాపెద్దగా అడగలేదు. రాష్ట్రానికి ఆర్థిక సాయం మాత్రమే ఆయన కోరుకంటున్నారు. కొన్నిప్రాజెక్టులను ప్రకటించడం ద్వారా ఇప్పుడు ఆయనను కేంద్ర పెద్దలు సంతృప్తి పరిచే ప్రయత్నం చేశారు. బడ్జెట్ లో కూడా కాస్త ప్రాధాన్యం లభిస్తే.. చంద్రబాబు ఇచ్చిన ప్రాధాన్యతకు గౌరవం లభించినట్లవుతుంది.