దిశ చట్టాన్ని అమలు చేసేస్తున్న ఏపీ సర్కార్ ఇప్పుడు రైతు భరోసా పోలీస్ స్టేషన్లపై దృష్టి పెట్టింది. అంటే మహిళలకు ప్రత్యేకంగా దిశ చట్టం తీసుకు వచ్చినట్లుగా రైతుల కోసం ప్రత్యేక చట్టం తీసుకు వచ్చి రైతు భరోసారి పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేస్తారన్నమాట. ఈ ఆలోచన వింతగా ఉందనిపించినా… పెద్దలకు మాత్రం కొత్తగా అనిపించింది. రైతులకు రక్షణగా పోలీసు వ్యవస్థ ఉండాలంటే.. ప్రత్యేకంగా జిల్లాకో పోలీస్ స్టేషన్ ఆలోచన చేస్తున్నట్లుగా సీఎం జగన్ ప్రకటించారు. వ్యవసాయ ఉత్పత్తుల విక్రయం తదితర వ్యవహారాల్లో మోసాలు జరిగితే రైతులకు అండగా నిల్చి, వారికి న్యాయం చేయడం కోసం ఈ వ్యవస్థ ఏర్పాటు చేయాలనేది జగన్ యోచన. ప్రతి పోలీస్‌స్టేషన్‌లో దిశ హెల్ప్ డెస్క్ తరహాలో రైతుల కోసం ఒక డెస్క్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
దిశ చట్టాన్ని కేంద్రం వెనక్కి పంపింది. తర్వాత అందులో ఉన్న అంశాలన్నింటినీ తొలగించి… చివరికి చట్టం అనే పేరు కూడా తీసేసి… ఏదో ొకటి పంపాలన్నట్లుగా ఓ బిల్లు పంపారు. కానీ.. ఆమోదం రాక ముందే దిశ పేరుతో ప్రభుత్వం హడావుడి చేసింది. ఇప్పటికీ అది కొనసాగుతోంది. లేకపోయినప్పటికీ.. సీఎం జగన్ అప్పుడప్పుడు దిశ చట్టంపై సమీక్షలు చేస్తూంటారు. ఈ క్రమంలో మంగళవారం కూడా సమీక్ష జరిగింది. అసలు లేని చట్టం కింద.. 471 కేసులకు సంబంధించి 7 రోజుల్లో, 1080 కేసులకు సంబంధించి 15 రోజుల్లో ఛార్జిషీట్లు దాఖలు చేశామని అధికారులు సీఎంకు వివరించారు. వాటిలో 103 కేసుల్లో శిక్షలు పడ్డాయన్నారు.
ఇతర చట్టాల కింద నమోదు చేసిన కేసులను సీఎం సంతృప్తి కోసం.. అధికారులు దిశ చట్టం కింద చూపిస్తున్నట్లుగా విమర్శలు వినిపిస్తున్నాయి. దిశ చట్టం గొప్పగా అమలవుతోందని భావించిన సీఎం కూడా 7 రోజుల్లో ఛార్జిషీటు దాఖలు చేయాలని ఆదేశించారు. రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్ల వద్ద దిశ కియోస్క్‌లు పెట్టాలని ఆదేశించారు. కాలేజీల వద్ద హోర్డింగ్స్ పెట్టి పెద్ద ఎత్తున ప్రచారం చేయాలన్నారు. మొత్తానికి దిశ చట్టం అమలవుతుందన్న అభిప్రాయాన్ని ప్రజల్లో కల్పించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నారు. కానీ.. అసల ుఅమల్లో లేని చట్టం గురించి ప్రజలను ఎందుకు మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారో ఎవరికీ అర్థం కాని విషయం.