ఎపికి ప్రత్యేకహౌదా కోసం వాదించి సాధించిందీ గద్దెక్కితే ప్రసాదించేది తామేనని చెప్పిన బిజెపి అగ్రేనేత కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు మాత్రం అక్షరాలా అలాటి అసాధారణ ఫెర్మామెన్స్ చేశారు. తాను చెప్పిన ప్రత్యేక హౌదా వచ్చే పరిస్థితి లేనందుకు ఆయన విచారం వ్యక్తం చేస్తే గౌరవంగా వుండేది. పశ్చాత్తాప పడితే ప్రజలు పోనీలే అనుకునే అవకాశం వుండేది. దానికి బదులు ఆయన ఎదురుదాడి మార్గం ఎంచుకున్నారు. ఎపికి పెద్ద దిక్కు ఆయననేనని బిజెపితో పాటు టిడిపి అధినేత కూడా నిత్యస్తోత్రం చేస్తుంటే వెంకయ్య నాయుడు మాత్రం నేను తెలంగాణలోనే అత్యధిక కాలం గడిపాను పొమ్మన్నారు. అసలు నేను అక్కడి నుంచి ఎన్నికై రాలేదని తేల్చిపారేశారు. మా విద్యార్థి దశనుంచే మేము రాష్ట్రాన్ని విభజించాలని అడుగుతున్నామని కుండబద్దలు కొట్టి చెప్పారు. ఇప్పటి వరకూ విభజన దోషాలన్నీ కాంగ్రెస్‌పైనే తోసి బిజెపితో స్నేహం చేస్తున్న తెలుగుదేశంకు తన వైఖరి ఏమిటో స్పష్టంగా చెప్పేశారు. తెలంగాణలో ఎపిలో బలం పెంచుకోవాలనుకుంటున్న బిజెపికి ఈ వాదన ఉపయోగపడుతుందేమో గాని ఒకచోట పాలకపక్షంగా వున్న టిడికి ఇరకాటమే. వివాదాలు వద్దంటూన వెంకయ్యనాయుడు ే సీతారాం ఏచూరి వైఎస్ రాజశేఖర రెడ్డి జైరాం రమేష్ అందరి పేర్లు తీశారు. అన్నిటికన్నా విచిత్రం ఎన్టీఆర్ దేవాంతకుడు సినిమాను ఉటంకించడం. ఈ ఉదాహరణ తనకూ తన ప్రభుత్వానికి వర్తిస్తుందని గుర్తించలేకపోయారు. ఏకాదశి నాడు ఉపవాసం వుండి తినాలని అనుకున్న అవ్వకు నరకం ప్రాప్తిస్తే ఎన్నో కట్టాలి దానాలివ్వాలి అనుకున్న నాకు స్వర్గం ఎందుకు రాదని నిలదీస్తాడు హీరో. మరి ఇక్కడ ప్రత్యేక హౌదా ఇవ్వాలనుకుని ఇవ్వకుండా నరకం చూపిస్తున్నది ఎవరో వెంకయ్య గారే చెప్పాలి మరి! అందుకే మొత్తంపైన వెంకయ్య పెర్మామెన్స్లో ఎన్టీఆర్‌ను మించిపోయారని చెప్పొచ్చు. ఇంతకూ ఎన్టీఆర్ సూపర్ హిట్ యమగోలకు తర్వాత వచ్చిన అనేకకానేక యమ సినిమాలకూ ప్రేరణ దేవాంతకుడే! అందులో గొగ్గోగొంగూర జైజైజై జై ఆంధ్ర అన్న పాట కూడా వుంటుంది!