మేఘా కృష్ణారెడ్డి ఇళ్లు, కార్యాలయాలపై జరుగుతున్న సోదాల విషయం ముందుగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఐటీ అధికారులెవరికీ తెలియదు. ప్రత్యేకంగా మేఘా కృష్ణారెడ్డి ఇంట్లో సోదాల కోసం ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి ఓ బృందం వచ్చింది. రెండు తెలుగురాష్ట్రాలతో పాటు ఇతర చోట్ల కూడా.. కాంట్రాక్ట్ పనులు చేస్తున్న మేఘా కృష్ణారెడ్డి .. ముందస్తు పన్ను చెల్లింపుల విషయంలో పొదుపుగా ఉంటున్నట్లుగా తెలుస్తోంది. ఇటీవల దేశంలోనే అత్యంత ధనవంతులైన వారి జాబితాలో ఉన్న మేఘా కృష్ణారెడ్డి, పాపిరెడ్డిలు.. మరీ తక్కువగా ముందస్తు పన్ను చెల్లించడమేమిటన్న అనుమానాలు ఐటీ వర్గాలకు వచ్చాయి. వెంటనే ఆ మేఘా కృష్ణారెడ్డి చేపడుతున్న ప్రాజెక్టుల వివరాలు సేకరించి… ఇప్పటి వరకూ ప్రభుత్వాల నుంచి పొందిన బిల్లుల వివరాలు కూడా.., తెలుసుకుని.., అక్రమాలు జరిగినట్లుగా నిర్ధారించుకుని రంగంలోకి దిగినట్లుగా ప్రచారం జరుగుతోంది.
శుక్రవారం ఉదయం ప్రారంభమైన సోదాలు… అర్థరాత్రి దాటినా పూర్తి కాలేదు. పలు కీలకమైన లావాదేవీలకు సంబంధించి ఆధారాలు లభించడం.. వాటికి సంబంధించిన అదనపు సమాచారం… తెప్పించడంతో… అధికారులు బిజీగా ఉన్నట్లుగా తెలుస్తోంది. మెఘా కృష్ణారెడ్డికి చెందిన…దేశవ్యాప్తంగా ఉన్న ఆఫీసుల్లో సోదాలు జరిగినట్లుగా ప్రచారం జరిగింది కానీ… అలాంటిదేమీ లేదని.. ఐటీ వర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్లోని మేఘా కృష్ణారెడ్డి ఇల్లు, ఆయన ప్రధాన కార్యాలయంలోనే మాత్రమే సోదాలు జరుగుతున్నట్లు చెబుతున్నారు. ఇందులో బయటపడే విషయాలను బట్టి.. మిగతా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి.
సాధారణంగా… ఎంతో పక్కా ఆధారాలు ఉంటే తప్ప… ప్రత్యేక బృందాలను… ఐటీ వినియోగించదు. ఇటీవలి కాలంలో మీడియా విలీనాలు.. ఎలక్ట్రిక్ బస్సుల తయారీ కంపెనీలను కొనడం వంటివి మేఘా కృష్ణారెడ్డి చేశారు. దాంతో.. ఆ లావాదేవీలపై ఐటీ శాఖ ప్రత్యేక దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. మేఘా కృష్ణారెడ్డి విషయంలో.. ఇటీవలి కాలంలో.. అనేక వివాదాలు వెలుగు చూస్తున్నాయి. టీవీ9 కొనుగోలు వ్యవహారం … పోలవరం రివర్స్ టెండర్లు ఇందులో ప్రధానంగా ఉన్నాయి. వీటిపై మేఘా కృష్ణారెడ్డి ఎప్పుడూ బహిరంగంగా స్పందించలేదు. ఇప్పుడు మాత్రం.. ఐటీ దాడులు రొటీన్ చెకప్నేనని మీడియాకు సమాచారం ఇస్తున్నారు.