ఏపీ సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా రక్తదానం ఇవ్వాలనుకుంటున్నారా ? అయితే మీ కోసం ఓ వెబ్ సైట్ రెడీగా ఉంది. సజ్జల రామకృష్ణారెడ్డి ప్రత్యేకంగా వెబ్ సైట్ రూపకల్పన చేసి .. స్వయంగా ఆవిష్కరించారు. ఇందులో పేరు నమోదు చేసుకుంటే చాలు.. వారికి అవసరం వచ్చినప్పుడు లేదా.. ఇచ్చేద్దామని వచ్చినప్పుడు రక్తం సేకరించుకుంటారు.
ఈ సారి జగన్ పుట్టిన రోజు సందర్భంగా రికార్డు బ్రేకింగ్ రక్తదానం జరగాలని సజ్జల లక్ష్యంగా పెట్టుకున్నారు. సీఎం జగన్ పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించనున్నామని.. ఆయనకు ఉన్న కోట్లాది మంది అభిమానులు పాల్గొంటారని, సంక్షేమ పథకాలతో లబ్దిపొందిన వారంతా పాల్గొంటారని సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. పాల్గొనడం అంటే రక్తదానం చేయడమేనా ఇంకేదైనా ఉంటుందా అన్నది స్పష్టత రావాల్సి ఉంది. బ్లడ్ డొనేషన్‌కు పేర్లు నమోదు చేసుకుంటే అవసరమైనప్పుడు రక్తదానం చేసే అవకాశం ఉందన్నారు.
సీఎం జగన్ యాభై పుట్టిన రోజు వేడుకలను ఇప్పటికే ఘనంగా నిర్వహిస్తున్నారు. జగనన్న స్వర్ణోత్సవ సంబరాల పేరిట కొద్ది రోజులుగా పండగ చేస్తున్నారు. ఇందు కోసం రెండు కోట్ల రూపాయలు .. సాంస్కృతిక శాఖకు కేటాయించారు. ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి 1972, డిసెంబర్ 21న జన్మించారు. ఈ పుట్టిన రోజుకు 50వ ఏట అడుగు పెడుతున్నారు.