దిల్ రాజు నిర్మాణంలో వేణు దర్శకత్వంలో ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్ తారాగణంగా రూపొందిన చిత్రం బలగం. విమర్శకులతోపాటు ప్రేక్షకులు ఈ సినిమాపై ప్రశంసలు కురిపిపించారు. అయితే ఇప్పుడు గడ్డం సతీష్ అనే జర్నలిస్ట్.. బలగం సినిమా కథ నాదేనని దిల్ రాజ్ ప్రొడక్షన్ హౌస్, దర్శకుడు వేణుపై ఆరోపణలు చేశారు.
‘’ఈ కథను నేను 2011లో రాసిన పచ్చికి కథను 2014లో డిసెంబర్ 24న నమస్తే తెలంగాణలో ఆదివారం మ్యాగజైన్ బతుకమ్మలో అచ్చు వేశారు. నా కథలో కాస్త మార్పులు చేర్పులు చేసి దిల్ రాజు ఈ కథను కమర్షియల్ సినిమాగా తీసి డబ్బులను ఆయన జేబులో వేసుకుంటున్నాడు. పైగా బెదిరింపులకు పాల్పడుతున్నాడు. నేను రాసిన పచ్చికి కథను 90 శాతం తీసుకొని సినిమాగా మార్చారు నాకు రావలసిన గుర్తింపు నాకు ఇవ్వాలి. సినిమా టైటిల్స్‌లో మూల కథ నాదేనని క్రెడిట్ ఇవ్వాలి. లేని పక్షంలో న్యాయపోరాటం చేస్తా’ అని చెప్పారు సతీష్. మరి దీనిపై దిల్ రాజు స్పందన ఎలా వుంటుందో చూడాలి.