మహేష్ ఫ్యాన్స్‌కి మరో సూపర్ న్యూస్. మహేష్ బాబు తాజా చిత్రం స్పైడర్‌ని అరబిక్ భాషలో డబ్ చేశారు. అరబ్ దేశాల్లో ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ వెర్షన్లతో పాటు.. అరబిక్ వెర్షన్లోనూ విడుదల చేయబోతోంది చిత్రబృందం. ఈ విషయమై దర్శక నిర్మాతలు కూడా క్లారిటీ ఇచ్చేశారు. ”స్పైడర్‌ని అరబిక్‌లో విడుదల చేస్తున్నాం. గల్ఫ్ దేశాల్లో మన తెలుగు సినిమాలకు విపరీతమైన గిరాకీ ఉంది. అందులోనూ మహేష్ సినిమా అంటే ఎగబడి చూస్తారు. అందుకే స్పైడర్‌ని అరబిక్‌లో విడుదల చేస్తున్నాం. అందుకు సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి” అని మురుగదాస్ తెలిపారు. సెప్టెంబరు 9న ‘స్పైడర్’ తమిళ వెర్షన్ ఆడియో రిలీజ్‌ని చెన్నైలో ఘనంగా చేయాలని చిత్రబృందం చూస్తోంది. మహేష్ తమిళంలో నేరుగా చేస్తున్న సినిమా ఇదే. అందుకే… ఈసారి మహేష్ చెన్నై ప్రచారాన్ని జోరుగా చేయాలని నిర్ణయించుకొన్నాడు. తమిళ వెర్షన్ ఆడియోకి రజనీకాంత్, విజయ్‌లాంటి హేమాహేమీలు వస్తారని ప్రచారం జరుగుతోంది. ”రజనీసార్ వస్తే బాగానే ఉంటుంది. నిర్మాతలకు అందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి” అంటున్నాడు మురుగదాస్. సెప్టెంబరు 27న స్పైడర్ విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.