క్రియేటివ్ దర్శకులతో ఒక్కటే సమస్య. సినిమాని అద్భుతంగా తీయాలన్న తపనతో `చెక్కడం` మొదలెడతారు.
బెటర్మెంట్ కోసం తీసిందే తీస్తుంటారు. మురుగదాస్కీ ఈ అలవాటుంది. ఇప్పుడాయన మహేష్‌బాబుని `స్పైడర్`గా చూపించబోతున్నారు. ఈసినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేయడానికే మురుగదాస్ చాలా టైమ్ తీసుకొన్నాడు. మహేష్ సినిమాలో కొన్ని కీలక ఘట్టాల్ని రీషూట్ చేస్తున్నారని, అందుకే ఈ సినిమా ఆలస్యం అవుతోందని గుసగుసలు వినిపించాయి. చిత్రబృందం మాత్రం `అలాంటిదేం లేదు` అంటూ క్లారిటీ ఇచ్చింది. కానీ రీషూట్ల విషయం నమ్మాల్సిందేనేమో అనిపిస్తోందిప్పుడు. దానికి కారణం.. స్పైడర్ రిలీజ్‌డేట్ వాయిదా పడడమే. ఈ సినిమాని జులై 23న రిలీజ్ చేద్దామనుకొన్నారు. అయితే… ఇప్పుడు ఆ సమయానికి స్పైడర్ రావడం లేదు. ఇప్పుడీ సినిమా ఆగస్టుకి వెళ్లిపోయిందన్నది ఇన్సైడ్ వర్గాల టాక్.
వీఎఫ్ఎక్స్కి సంబంధించిన వర్క్ చాలా వరకూ పెండింగ్ ఉందని, అందుకే ఈ సినిమా జూన్‌లో విడుదల చేయడం సాధ్యం కాదని చిత్రబృందం సెలవిచ్చింది. అయితే.. ఇదేం వీఎఫ్ఎక్స్తో ముడిపడిన సినిమా కాదు. ఒకవేళ గ్రాఫిక్స్ తో పని ఉన్నా, అది యాక్షన్ ఎపిసోడ్స్ వరకే అయ్యింటుంది. దాంతో రీషూట్ల ప్రస్తావన మళ్లీ బయటకు రావడానికి ఆస్కారం దొరికింది. రీషూట్లే లేకపోతే ఈ సినిమా ఎందుకు ఇంత ఆలస్యం అవుతుందన్నది అభిమానుల ప్రశ్న. సో.. వీటికి మురుగదాస్ అండ్ టీమ్ ఏం సమాధానం చెబుతుందో…??