ఎన్టీఆర్… అటు సినిమా రంగంలోనూ, ఇటు రాజకీయ రంగంలోనూ తిరుగులేని విజయాల్ని అందుకొన్నారు. వ్యక్తిగత జీవితంలోనూ ఆయనకు ఎలాంటి అసంతృప్తులూ లేవు. పరిపూర్ణ జీవితాన్ని అనుభవించారు. అయితే… ఆయనకూ ఓ ఫెయిల్యూర్ ఉంది. అందులోనూ ప్రేమ విషయంలో! ఆ ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళ్తే..
ఫ్లాష్ బ్యాక్: అక్కినేని స్వీట్ రివైంజ్
ఎన్టీఆర్ ఇంకా సినిమాల్లోకి రాలేదు. తన కష్టమ్మీద బంగారు భవిష్యత్తు నిర్మించుకొంటున్న రోజులవి. ఎన్టీఆర్ సినిమాల్లోకి రాక ముందు పాలు అమ్మేవారన్న సంగతి తెలిసిందే. నిమ్మకూరులో తెల్లవారుఝామున 3 గంటలకు లేచి, పాలు పితికి, సైకిల్ మీద విజయవాడ వచ్చి, ఇంటింటికీ తిరిగి పాలు వేసేవారు. బహుశా.. 3 గంటలకు లేవడం అనేది ఆయనకు అప్పటి నుంచే అలవాటు అయ్యిందేమో. విజయవాడలో సుప్రసిద్ధ బాబాయ్ హోటెల్ కీ ఆయనే పాలు సరఫరా చేసేవారు. అక్కడే ఓ పెద్దింటి కాలనీ ఉంది. అక్కడ ప్రతీ ఇంటికీ ఆయనే పాలు పోసేవారు. ఓ ఇంట్లో అందమైన అమ్మాయి ఎదురు పడింది. ఇద్దరి చూపులు కలిశాయి. అప్పటి నుంచీ.. ఇద్దరూ చూపులతో మాట్లాడుకోవడం మొదలెట్టారు. రామారావు వస్తారని తెలిసి, ఉదయాన్నే లేచి, ముస్తాబై, కిటీకి తలుపులు తెరచి ఎదురుచూస్తుండేది ఆ అమ్మాయి. కొన్ని రోజులు ఇలానే మూగ ప్రేమ కథ నడిచింది. ఆ తరవాత మాటలు మొదలయ్యాయి. ఆ ఇంటి అరుగుమీదే.. కాసేపు మాట్లాడి వెళ్లిపోయేవారు ఎన్టీఆర్. తెల్లవారు ఝాము కాబట్టి, ఎవరూ ఉండేవారు కాదు. అలా దొరికిన ప్రైవసీ ఉపయోగించుకొనేవారు. కొన్నాళ్లు గడిచాక.. ఈ విషయం అమ్మాయి వాళ్లింట్లో తెలిసిపోయింది. పెద్ద గొడవే జరిగింది. ‘మా ఇళ్లకు పాలు పోయడానికి రావక్కర్లేద్దు’ అని ఖరాఖండీగా చెప్పేశారు. అయినా ఎన్టీఆర్ ఆ వీధికి వెళ్లడం మానలేదు. చాటుమాటు చూపులు కలుస్తూనే ఉన్నాయి. అదీ ఇంట్లో వాళ్లకు తెలిసిపోయింది. ఈ ప్రేమకథ ఎక్కడికి వెళ్తుందో అనే భయంతో ఆ ఇంట్లో వాళ్లు ఊరు వదిలేసి వెళ్లిపోయారు. అప్పటి నుంచీ కమ్యునికేషన్ లేదు. దాంతో.. ఎన్టీఆర్ ప్రేమ కథ అక్కడితో ముగిసిపోయింది. ఆ తరవాత బసవతారకంని పెళ్లి చేసుకొన్నారు. వాళ్లిద్దరికీ ముడి పెట్టి ఉంది కాబట్టే… దేవుడు ఈ ప్రేమకథని ఇక్కడితో ఆపేశాడేమో..?!
ఆ పాలవాడు… ఆ తరవాత సినిమాల్లోకి వెళ్లి, స్టార్‌గా మారి, ముఖ్యమంత్రి కూడా అయిన తరవాత.. ప్రేమించిన అమ్మాయి పరిస్థితి ఏమిటో? ‘ఇతన్నా మేం వద్దనుకొన్నది’ అంటూ ఆ ఇంట్లో వాళ్లు ఎంత మదన పడ్డారో.. అది వేరే సంగతి.
నిజానికి ఎన్టీఆర్ లవ్ స్టోరీని ఎన్టీఆర్ బయోపిక్ ‘కథానాయకుడు’లో చూపిద్దామనుకొన్నారు. క్రిష్ ఈ ఎపిసోడ్ ని అందంగా రాసుకొన్నారు కూడా. కానీ.. ఎందుకో తెరకెక్కించలేదు.