తానా అసోసియేషన్ తో పాటు పలువురు ప్రముఖుల సహకారంతో ఖమ్మంలో ఏర్పాటు చేస్తున్న అతి పెద్ద కృష్ణుని ఆకారంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆయన శత జయంతి రోజు అయిన మే 28న తారక్ ఆవిష్కరించనున్నారు. నిజానికి గత ఏడాదే ఈ విగ్రహం ఆవిష్కరించాల్సి ఉంది. కానీ పనులు పూర్తి కాకపోవడంతో వాయిదా పడింది. ఈ ఏడాది పనులు పూర్తయ్యాయి. ఇప్పటికే విగ్రహం సిద్ధం చేశారు.
ఖమ్మంలో లకారం ట్యాంక్ బండ్‌పై ఈ విగ్రహాన్ని ఏర్పటు చేస్తున్నారు. బేస్‌మెంట్‌తో కలిపి 54 అడుగులు ఎత్తు ఉండే ఈ విగ్రహంలో తల భాగం ఐదు అడుగులు, కాళ్ల భాగం ఐదు అడుగులు ఇంకా మొత్తం శరీర భాగం ఎత్తు మాత్రమే 45 అడుగులుగా ఉండనుంది. ఎటు చూసినా 36 అడుగుల పొడవు వెడల్పులతో వెయ్యి అడుగుల విస్తీర్ణం ఉండే బేస్మెంట్ పైన ఈ విగ్రహాన్ని అమర్చనున్నారు. దాదాపుగా రూ. నాలుగు కోట్లను ఈ విగ్రహం కోసం ఖర్చు చేశారు. హైదరాబాద్ హుస్సేన్‌సాగర్ మధ్యలో బుద్దుని విగ్రహం మాదిరే దీన్ని ఏర్పాటు చేస్తున్నారు.
పార్టీ పరంగా టీడీపీ నిర్వహిస్తున్న శత జయంతి వేడుకలకు ఎన్టీఆర్ హాజరు కావడం లేదు. రాజకీయాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. ఈ అంశంపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఖమ్మం లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ మాత్రం రాజకీయాలకు అతీతంగా జరుగుతోంది. ఆ జిల్లా మంత్రి పువ్వాడ అజయ్ ప్రత్యేక శ్రద్ధ చూపించి అనుమతులు.. ప్రభుత్వం వైపు నుంచి పనులు సాఫీగా జరిగేలా చూస్తున్నారు. అదే సమయంలో ఆయన కూడా విగ్రహం కూడా తన వంతు సాయం చేస్తున్నారు. ఎన్టీఆర్ ఈ విగ్రహావిష్కరణ చేయనున్నారు.