మొదటి సినిమాతోనే అందరికీ నచ్చేసింది శ్రీలీల. బాలీవుడ్ ఫీచర్స్ తో తెలుగు అమ్మాయి దొరికిందని ఇండస్ట్రీ కూడా సర్ప్రైజ్ అయ్యింది. ఇప్పుడు ధమాకా లో రవితేజ సరసన నటిస్తోంది. ధమాకా గురించి ప్రీరిలీజ్ ఈవెంట్ లో శ్రీలీల మాటలు కూడా రవితేజ ఫ్యాన్స్ కి తెగ నచ్చాయి.
”రవితేజ గారికి నేను ఫ్యాన్ ని. చాలా అకింత భావంతో పని చేసే హీరో ఆయన. ఒక ఫైట్ సీక్వెన్స్ లో ఆయన కాలికి గాయమైయింది. పన్నెండు కుట్లు పడ్డాయి. తర్వాత రోజు దండకడియాల్ పాట షూటింగ్ కి వచ్చారు. ఆయన గాయంతో షూటింగ్ కి వచ్చారనే సంగతి తెలిసి షాక్ అయ్యా. ఒక మెడికల్ స్టూడెంట్ గా ఆ గాయం పెయిన్ ఎలా వుంటుందో తెలుసు. కానీ అదేం లెక్క చేయకుండా ఆయన షూట్ చేశారు. మీరు ఆ పాట చూస్తున్నపుడు ఆయన కాలికి గాయమైన సంగతి అర్ధం కాదు. ఆయన కాలికి గాయమైనట్లు మీకు అనిపిస్తే నా పేరు మార్చుకుంటా” అని ఒక స్వీట్ సవాల్ కూడా చేసింది శ్రీలీల.