మొన్నటి వరకూ సైలెంట్ వున్న ‘రాబిన్హుడ్’ సినిమాకి మంచి జోష్ తీసుకొచ్చిన పాట ‘అది దా సర్ప్రైజ్’. దిల్ రాజు వైరల్ స్పీచ్ లోని వర్డ్ ని వాడుకుని డిజైన్ చేసిన ఈ పాటలో కేతిక శర్మ నటించింది. ఈ పాటలో కేతిక నృత్య బంగిమలపై చాలా విమర్శలు వచ్చాయి. కొరియోగ్రఫర్ శేఖర్ మాస్టర్ క్రియేటివిటీపై కొందరు విరుచుకుపడ్డారు. మహిళా కమీషన్ ఈ పాటలోని పలు బంగిమలని అశ్లీల నృత్యాలుగా పరిగణించింది. మహిళలని కించపరిచే విధంగా చిత్రీకరణ వుందని అభిప్రాయపడింది.
ఇదే అంశంపై దర్శకుడు వెంకీని అడిగితే.. ఆ పాట చేస్తునపుడు మాకెవరికీ అందులో అశ్లీలత కనిపించలేదని, ఒక ప్రత్యేకమైన పాటలానే చిత్రీకరించామని, నిజంగా అప్పుడు అది అశ్లీలంగా అనిపిస్తే అసలు చిత్రీకరించే వాళ్ళమే కాదని చెప్పాడు.
తాజాగా శ్రీలీల ఈ పాట పై రియాక్ట్ అయ్యింది. ‘నేను కూడా ఐటెం సాంగ్స్ చేశాను. ఇలాంటి పాటలకు అమ్మాయి కంఫర్ట్ ముఖ్యం. అమ్మాయి కంఫర్ట్ గా ఫీలయితే అందులో ఇష్యూ ఉండదని భావిస్తున్నాను. అది అమ్మాయి స్వేఛ్చ. అయితే మహిళా కమీషన్ చర్యలపై నేను మాట్లాడుదలచుకోలేదు. అదొక ముఖ్యమైన సంస్థ. వారి విధి విధానాలు వారికి వుంటాయి. సమాజానికి ఏది మంచిదో వారికి తెలుసు. ఒక నటిగా అమ్మాయి కంఫర్ట్ గురించి అయితే చెప్పగలను. నేను సాంగ్స్ చేసినప్పుడు కూడా నాకు కంఫర్ట్ గా అనిపిస్తేనే చేస్తాను’అని తన వెర్షన్ చెప్పుకొచ్చింది శ్రీలీల.