లవ్ స్టోరీ తరవాత శేఖర్ కమ్ముల సినిమా ఒకటి ఇటీవలే పట్టాలెక్కింది. నాగార్జున, ధనుష్ కథానాయకులుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమా సెట్స్‌పై ఉండగానే శేఖర్ కమ్ములతో మరో సినిమా ప్రకటించింది ఈ నిర్మాణ సంస్థ. శేఖర్ కమ్ములతో ఇది హ్యాట్రిక్ సినిమా అవ్వబోతోంది. లవ్ స్టోరీ చిత్రానికి కూడా నిర్మాతలు వీళ్లే. ధనుష్ సినిమా పూర్తయిన వెంటనే ఈ ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకెళ్తారు. హీరో ఎవరు? అనే విషయాన్ని చిత్రబృందం గోప్యంగా ఉంది. హీరోతో పాటుగా నటీనటులు, మిగిలిన వివరాలు త్వరలో వెల్లడిస్తారు.
ప్రస్తుతం ధనుష్, నాగార్జునల చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోంది. ముంబైలోని ‘ధారావి’ అనే మురికివాడ నేపథ్యంలో సాగే కథ ఇది. ఈ చిత్రానికి ‘ధారావి’ అనే పేరు పరిశీలిస్తున్నట్టు సమాచారం. రష్మిక కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. శేఖర్ కమ్ముల తొలిసారి చేస్తున్న యాక్షన్ డ్రామా ఇది.