చిత్రసీమకు వెన్నెముక్క మీడియం రేంజు హీరోలే. చిన్న నిర్మాతలకు, కాన్సెప్ట్ కథలకూ వాళ్లే చిరునామా. మీడియం రేంజు హీరోకి హిట్టు పడితే – మరిన్ని కొత్త కథలు పుట్టుకొస్తాయి. కొత్త నిర్మాతలు తయారవుతారు. శ్రీవిష్ణు కూడా మీడియం రేంజు హీరోనే. 3 నుంచి 4 కోట్లతో సినిమాని పూర్తి చేసుకుంటే, మినిమం గ్యారెంటీ ఉంటుంది. శాటిలైట్, డిజిటల్ రూపంలో పెట్టుబడిని తిరిగిరాబట్టుకోవొచ్చు. ‘బ్రోచేవారెవరురా’ టైపు హిట్టు దక్కితే – ఇక అంతా లాభమే. అందుకే చిన్నసైజు నిర్మాతలకు శ్రీవిష్ణు ఓ మంచి ఆప్షన్‌గా మిగిలాడు.
అయితే ఇప్పుడు శ్రీవిష్ణు కూడా బడ్జెట్లు పెంచుతున్నాడని టాక్. ఈ మధ్య ప్రదీప్ వర్మ అనే కొత్త దర్శకుడి కథని ఓకే చేశాడు శ్రీవిష్ణు. ఇదో పోలీస్ స్టోరీ. కమర్షియల్ అంశాలు బాగానే ఉంటాయి. ఈ సినిమా చేయడానికి ఇద్దరు ముగ్గురు నిర్మాతలు ముందుకొచ్చారు. అయితే శ్రీవిష్ణు రూ.7 నుంచి 8 కోట్ల వరకూ పెట్టుబడి పెట్టాలనుకుంటేనే ఈ సినిమా చేయమంటున్నాడట. రూ.4 – 5 కోట్లలో ముగించాలని భావిస్తే మాత్రం కుదరదు అంటున్నాడు. రూ.8 కోట్లు ఓ ప్యాకేజీలా ఇస్తే, అందులోనే సినిమా పూర్తి చేసి, ప్రమోషన్లు కూడా చేసి పెడతానంటున్నాడట. శ్రీవిష్ణుపై 8 కోట్లు రిస్కే. అందుకే ఈ సినిమా చేయడానికి నిర్మాతలు వెనుకా ముందూ ఆలోచిస్తున్నార్ట. ‘బ్రోచేవారెవరురా’ హిట్టు తరవాత 8 కోట్లు పెట్టడానికి నిర్మాతలు రెడీ అయ్యారేమో. మధ్యలో ‘తిప్పరా మీసం’ వచ్చింది. అది డిజాస్టరు. ఆ సినిమా చూశాక ఇంత ధైర్యం ఎవరు చేస్తారని..??