జయాపజయాలతో సంబంధం లేకుండా, ఏడాదికి రెండు మూడు సినిమాలు చేసే హీరోల్లో శ్రీవిష్ణు ముందు వరుసలో ఉంటాడు. తన నుంచి ఇటీవలే ‘శ్వాగ్’ సినిమా వచ్చింది. బాక్సాఫీసు దగ్గర ఈ సినిమాకు సరైన ఫలితం రాలేదు. అయితే ఈలోగా మరో సినిమాపై సంతకం చేసేశాడు విష్ణు. ఈ సినిమాతో రాఘవరెడ్డి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. బాక్సాఫీసు దగ్గర రిజల్ట్ రాకపోయినా, దర్శకుడిలో విషయం ఉందన్న సంగతి ఈ సినిమాతో అర్థమైంది. దాంతో తనకు మరో అవకాశం వచ్చింది. ఇప్పుడు శ్రీవిష్ణుకు ఓ కథ చెప్పి ఓకే చేయించుకొన్నాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.
‘స్వాతిముత్యం’ సినిమానీ సితారనే అందించింది. అదే దర్శకుడితో ఇప్పుడు సితార మరో ప్రయత్నం చేయబోతోందన్నమాట. ‘స్వాతిముత్యం’లానే ఇది కూడా ఓ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. ‘ఓం భీం భుష్’, ‘శ్వాగ్’ చిత్రాలతో డిఫరెంట్ జోనర్ ప్రయత్నించాడు శ్రీవిష్ణు. నిజానికి తనకు లవ్ స్టోరీలు, ఫ్యామిలీ డ్రామాలు బాగా కలిసొస్తాయి. ‘సామజవరగమన’ అలాంటి సినిమానే. అది మంచి విజయాన్ని అందుకొంది. ఇప్పుడు మళ్లీ తనకు అచ్చొచ్చిన జోనర్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్టు పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం నటీనటులు, ఇతర సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. త్వరలోనే పూర్తి వివరాలు బయటకు వస్తాయి.