శ్రీవిష్ణు లైనప్ బావుంది. వరుసగా వినోదాత్మక చిత్రాలు చేస్తున్నాడు. మధ్యలో ‘స్వాగ్’ లాంటి ప్రయోగాలు దెబ్బకొట్టినప్పటికీ కామెడీ టచ్ వున్న సామజవరగమనా, ఓం భీమ్ భుష్ లాంటి చిత్రాలు తనకి మంచి ఫలితాల్ని ఇస్తున్నాయి. ప్రస్తుతం గీత ఆర్ట్స్ లో సింగిల్ సినిమా చేస్తున్నాడు. అది సెట్స్ పై వుండగానే మరో సినిమాకి పచ్చజెండా ఊపాడు.
యదునాథ్ మారుతీ రావు అనే కొత్త దర్శకుడితో సినిమా చేస్తున్నాడు శ్రీవిష్ణు. హరోం హర తీసిన సుమంత్ నాయుడు ఈ సినిమాకి నిర్మాత. ఇదొక కామెడీ ఎంటర్ టైనర్. శ్రీవిష్ణుకి బాగా కలిసొచ్చిన జోనర్. హోల్సమ్ ఎంటర్ టైన్మెంట్ వున్న సినిమాలు ఈమధ్య కాలంలో బాగా ఆడుతున్నాయి. ఈ కథ కూడా పక్కా వినోదంతో తయారు చేశారు. రధన్ ఈ సినిమాకి మ్యూజిక్. త్వరలోనే హీరోయిన్ పేరు రివిల్ చేశారు.