శ్రీ విష్ణు గీతా ఆర్ట్స్ సమర్పణలో ఓ సినిమా చేస్తున్నాడు. నిను వీడని నీడను నేనే ఫేం కార్తీక్ రాజు ఈ సినిమాకి దర్శకత్వం. విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మాతలు. ఈ సినిమాకి ‘సింగిల్’ అనే క్యాచి టైటిల్ పెట్టారు. టైటిల్ గ్లింప్స్ ని చాలా ఫన్నీగా కట్ చేశారు.
వెన్నెల కిషోర్ పై టైటిల్ టీజర్ ఓపెన్ అవుతుంది. ”ముడ్డి కిందకి ముఫ్ఫై ఐదేళ్ళు వచ్చినా నాకు ఇంకా పెళ్లి కాకపోవడానికి కారణం వాడే. దరిద్రానికి దత్త పుత్రుడు.. నా చిన్ననాటి మిత్రుడు’ అని చెప్పిన ఇంట్రోతో శ్రీ విష్ణు పరిచయం కావడం గమ్మత్తుగా వుంది. టీజర్ హీరోయిన్స్ కేతిక, ఇవానకి కూడా చోటు దక్కింది.
శ్రీవిష్ణు కథల ఎంపిక బావుంటుంది. ముఖ్యంగా వినోదాత్మక సినిమాలు చేయడంలో తనది స్పెషల్ మార్క్. సింగిల్ టైటిల్ గ్లింప్స్ కూడా చాలా పాజిటివ్ గా వుంది. విశాల్ చంద్ర శేఖర్ ఇచ్చిన ఆర్ఆర్, వెల్రాజ్ కెమరాపనితనం లైటర్ వెయిన్ ఎంటర్ టైన్మెంట్ సరిగ్గా నప్పాయి. సామజవరగమన తో హిట్ కొట్టిన శ్రీవిష్ణు, స్వాగ్ లాంటి ఓ ప్రయోగం చేసిన ఇబ్బందిపడ్డాడు. ఇప్పుడు సింగిల్ తో మళ్ళీ తన జోన్ లోకి వచ్చాడని టైటిల్ టీజర్ హింట్ ఇచ్చింది.