శ్రీవిష్ణు మంచి జోరుమీదున్నాడు. ఆయన నటిస్తున్న మూడు సినిమాలు సెట్స్ పై వున్నాయి. గీత ఆర్ట్స్ లో సింగిల్ సినిమా చేస్తున్నాడు. కార్తిక్ ఈ సినిమాకి డైరెక్టర్. ‘మృత్యుంజయ్’ అనే ఓ థ్రిల్లర్ సినిమా చేస్తున్నాడు. దీనికి హుస్సేన్ షా కిరణ్ డైరెక్టర్.
ఈ రెండు కాకుండా స్వాతిముత్యం ఫేం డైరెక్టర్ లక్ష్మణ్ కే కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకి కూడా టైటిల్ ఫిక్స్ అయ్యింది. ఐటమ్ అనే వర్కింగ్ టైటిల్ తో షూట్ చేస్తున్నారని సమాచారం. దాదాపు ఇదే టైటిల్ ఫైనల్ కావచ్చు. స్వాతిముత్యం మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనర్. సినిమా థియేటర్స్ లో గొప్పగా రాణించలేదు కానీ ఓటీటీలోకి వచ్చాక అందులో ఫన్ ని ఆడియన్స్ ఎంజాయ్ చేశారు. ఐటమ్ కూడా హోల్సమ్ ఎంటర్ టైన్మెంట్ తోనే రూపొందుతోంది. సితార నాగవంశీ ఈ సినిమా నిర్మిస్తున్నారు. త్వరలోనే టైటిల్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేస్తారు.