ప్రస్తుతం విజయాల వేటలో ఉన్నాడు శ్రీవిష్ణు. బ్రోచేవారెవరురాతో ఓ సూపర్ హిట్టు అందుకుని, ఆ వెంటనే తిప్పరా మీసంతో చతికిల పడ్డాడు. మళ్లీ రేసులోకి రావాలంటే ఓ హిట్టు అందుకోవడం తప్పనిసరి. అందుకే… ఈసారి హిట్టు ఫార్ములాని నమ్ముకున్నాడు. కొత్త దర్శకుడు హసిత్ గోలితో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రానికి రాజ రాజ చోర అనే పేరు ఫిక్స్ చేశారు. టైటిల్ని బట్టి ఇది క్రైమ్ జోనర్ అనే సంగతి అర్థమైపోతోంది. ఫస్ట్ లుక్ చూస్తే ఆ చోరుడు.. శ్రీవిష్ణునే అనే విషయంలో క్లారిటీ వచ్చేస్తుంది.
క్రైమ్ జోనర్ కథే అయినా… కాస్త ఫాంటసీ అంశాలు, చారిత్రక నేపథ్యం ఈ కథలో ఉంటాయని తెలుస్తోంది. వినోదానికి లోటు లేకుండా స్క్రిప్టు తయారు చేశారట. మొత్తానికి బ్రోచేవారెవరురా ఫార్ములాలోనే వెళ్తున్నాడు శ్రీవిష్ణు. ఇలాంటి కథలకు బాగా గిరాకీ ఉంది కాబట్టి – పాస్ అయిపోయే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి.