చిరంజీవి చిన్న కూతురు శ్రీజ పెళ్లి సందడి మీడియాలో ఫుల్ పబ్లిసిటీ చేసింది. ఎప్పుడో ఫిబ్రవరిలో మొదలవ్వాల్సిన 150వ సినిమాని సైతం శ్రీజ వివాహం కోసం వాయిదా వేశాడు . గతంలో శిరీష్ భరద్వాజ్ తో ప్రేమ వివాహం చేసుకొని విడిపోయిన విషయం అందరికి తెలిసిందే. ఆ తర్వాత శ్రీజకు చిత్తూరు జిల్లాకు చెందిన కళ్యాణ్ తో ఈ ఏడాది ఆరంభంలో వివాహం జరిగిన సంగతి తెలిసిందే. కళ్యాణ్ కూడా ధనిక వర్గానికి చెందిన వాడని, హీరో లక్షణాలు వున్న కళ్యాణ్, సినిమా హీరో అవ్వాలనే మెగా ఫ్యామిలీ తో సంబంధం కలుపుకున్నారని పెళ్లి లో చెవులు కోరుక్కున్నారు. అయితే ఇప్పుడు చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్ ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు మెగా ఫ్యామిలీ వర్గాల నుంచి ఓ వార్త బయటకు వచ్చింది. ఇప్పటికే చిరంజీవి కొడుకులు, మేనల్లుల్లు, అంతా హీరోలుగా వెండితెరపై దూసుకుపోతున్నారు. ఈ నేపధ్యంలో సినిమా రంగంపై ఉన్న ఆసక్తితో కళ్యాణ్ కూడా హీరో అవ్వాలని అనుకుంటున్నాడట. కళ్యాణ్ హీరోగా ఎంట్రీ ఇస్తే ఎలాగు మెగా ఫ్యామిలీ అండదండలు ఉంటాయి, మెగా ఫ్యాన్స్ సపోర్ట్ కూడా ఉంటుంది. కళ్యాణ్ హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి మొదట శ్రీజతో ఓ ప్రొడక్షన్ హౌస్ కూడా స్టార్ట్ చేస్తాడట కళ్యాణ్. సో చిరు అల్లుడు కళ్యాణ్ కూడా మెగా ఫ్యామిలీ నుంచి, టాలీవుడ్ తెరపై మరో ‘కళ్యాణ్’ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడన్నమాట.