మహేష్‌బాబు హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రెండు సినిమాలు వచ్చాయి. ఒకటి ‘దూకుడు’. రెండు ‘ఆగడు’! మహేష్ కెరీర్లో ఎప్పటికీ గుర్తుంచుకునే సినిమాగా ‘దూకుడు’ విజమం సాధిస్తే… అందరూ మర్చిపోవాలనుకునే సినిమాగా ‘ఆగడు’ పరాజయం పాలైంది. అక్కణ్ణుంచి నిర్విరామంగా కొనసాగుతున్న శ్రీను వైట్ల పరాజయాల పరంపరకు ఈ నెల 16న వస్తున్న ‘అమర్ అక్బర్ ఆంటోని’ బ్రేక్ వేస్తుందేమో చూడాలి. ‘ఎఎఎ’ విడుదల సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ‘మహేష్‌తో మీ సంబంధాలు ఎలా ఉన్నాయి? ఆగడు పరాజయం ప్రభావం చూపించిందా?’ అని శ్రీను వైట్లను ప్రశ్నిస్తే… ‘‘మహేష్ నాకు మంచి స్నేహితుడు. మా మధ్య మంచి సంబంధాలున్నాయి. మీకు ఓ నిజం చెప్పనా? ఎప్పుడూ సినిమా ఇవ్వమని మహేష్‌ని నేను అడగలేదు. మేం ఇద్దరం సినిమా చేయాలనుకున్నాం. చేశాం. ఇప్పటివరకూ ఏ నిర్మాతనూ సినిమా ఇవ్వమని నేను అడగలేదు. ‘అమర్ అక్బర్ ఆంటోని’కి ముందు నా సినిమాలు సరిగా ఆడలేదు. అయినా ఈ సినిమా కోసం ఐదుగురు నిర్మాతలు పోటీ పడ్డారు. ఐదుగురు లోంచి మైత్రీ మూవీ మేకర్స్‌ని నేను ఎంపిక చేసుకున్నా. ప్రతి సినిమా నేను బడ్జెట్లోనే తీశా’’ అని చెప్పారు. కొత్త కథతో ‘అమర్ ఆక్బర్ ఆంటోనీ’ తీశానని, తప్పకుండా విజయం సాధిస్తుందనీ ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.