శ్రీనువైట్ల చాలా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, శ్రీనువైట్లతో కలసి పనిచేయడానికి హీరోలంతా వెనుకంజ వేస్తున్నప్పుడు ‘నేనున్నా’ అని ధైర్యం చెప్పాడు రవితేజ. ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ ఈ రోజు విడుదలకు సిద్ధమైందంటే – ఈ సినిమాతో మళ్లీ శ్రీనువైట్లకు తనని తాను నిరూపించుకునే ఛాన్స్ వచ్చిందంటే అదంతా రవితేజ వల్లే. అందుకే ‘నా ట్రబుల్ షూటర్ రవితేజనే’ అంటూ కితాబిచ్చేశాడు శ్రీనువైట్ల. ఈరోజు రాత్రి హైదరాబాద్ లో ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో శ్రీనువైట్ల మాట్లాడుతూ….
”రవితేజ నా ట్రబుల్ షూటర్. హిట్టు కోసం ఎదురుచూస్తున్నప్పుడు వెంకీ ఛాన్స్ ఇచ్చాడు. దుబాయ్ శీను సమయంలోనూ అంతే. ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ టైమ్‌లోనూ శ్రీనునే హెల్ప్ చేశాడు. తన ఇచ్చిన నమ్మకమే ఈ సినిమా. ఎనిమిది నెలలు, ముగ్గురు రచయితలతో కలసి ఈ కథని తయారు చేశాను. ఆ ప్రయాణం చాలా బాగా జరిగింది. ప్రయాణం బాగుంటే విజయం తప్పకుండా వస్తుంది. ఈ సినిమా కూడా విజయం సాధిస్తుందని నమ్ముతున్నా. అమెరికాలో రెండు షెడ్యూల్స్ చేశాం. చాలా లగ్జరీగా ఈ సినిమా షూటింగ్ చేశా. అదంతా మైత్రీ మూవీస్ వల్లే సాధ్యమూంద”న్నాడు శ్రీనువైట్ల.