శ్రీ విష్ణు కెరీర్ లో చెప్పుకొదగ్గ సినిమాల్లో ‘రాజ రాజ చోర’ ఒకటి. ఈ సినిమాతో హసిత్ గోలీ దర్శకుడిగా పరిచయమయ్యాడు. డార్క్ కామెడీని ఇష్టపడే ప్రేక్షకులకు నచ్చిందీ సినిమా. ఇప్పుడీ కాంబినేషన్ లో మరో సినిమా రాబోతుంది. ఈ చిత్రానికి ‘స్వాగ్’ అనే పేరుని ఖరారు చేశారు. ఫాంటసీ టచ్ వుండే ఈ కథలో ఓ కోతి కూడా కీలకంగా కనిపిస్తుంది. ప్రీ టైటిల్ పోస్టర్ ని తోకతో డిజైన్ చేయడానికి కారణం ఇదే. రాజ రాజ చోరని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ & అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మించాయి. స్వాగ్ మాత్రం పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సోలో నిర్మితం. రేపు సినిమా టైటిల్ ని అధికారంగా అనౌన్స్ చేస్తారు. మరోవైపు శ్రీవిష్ణు ‘ఓ భీమ్ బుష్’ అనే ఓ వెరైటీ సినిమా పూర్తి చేశారు. మార్చి 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.