దర్శకుడిగా పాతికేళ్ళు పూర్తి చేసుకున్నారు శ్రీను వైట్ల. ఆయన తొలి సినిమా నీ కోసం వచ్చి పాతికేళ్ళయింది. వెంకీ, రెడీ, దూకుడు, ఢీ, దుబాయ్ శీను .. ఇలా వైట్ల కెరీర్ లో ఎన్నో విజయాలు వున్నాయి. దూకుడు తర్వాత వైట్ల కెరీర్ లో పీక్స్ చూశారు. అయితే అదే కాంబినేషన్ లో వచ్చిన ‘ఆగడు’ సినిమా వైట్లని వెనక్కి లాగింది. ఆ ఫ్లాప్ ఆయన కెరీర్ పై చాలా ప్రభావం చూపించింది. ఒక దశలో సినిమాలు కూడా తగ్గాయి.
ఈ ఏడాది విశ్వంతో వచ్చారు వైట్ల. ఈ సినిమా కూడా ఆయన అభిమానులు కొరుకునే కం బ్యాక్ కాదు. ఇప్పుడు కొత్త కథపై వర్క్ చేస్తున్నారు. ఓ కొత్త కుర్రాడు ఇచ్చిన ఐడియాతో వర్క్ జరుగుతోంది. ఈ విషయాన్ని ఆయనే చెప్పారు. ”ఓ కొత్త కుర్రాడు ఫ్రెష్ ఐడియాతో వచ్చాడు. ఫుల్ లెంత్ ఎంటర్ టైన్మెంట్ వుంటుంది. నావల్ పాయింట్, డెప్త్ వున్న సబ్జెక్ట్ కుదిరింది. కథ 70శాతం రెడీ అయిపోయింది. త్వరలోనే అనౌన్స్ మెంట్’ అని చెప్పారు వైట్ల.