అమరావతిలో బాలకృష్ణ వియ్యంకుడికి చంద్రబాబు ప్రభుత్వం ఎకరానికి రూ. లక్ష చొప్పన.. ఐదు వందల ఎకరాలు కేటాయించిందని.. మంత్రి బొత్స సత్యనారాయణ మంత్రి హోదాలో పెట్టిన ప్రెస్మీట్లో అధికారిక సమాచారం అన్నట్లుగా ఆరోపణలు చేశారు. ప్రపంచంలో కుటుంబసభ్యులు ఎవరైనా అధికారంలో ఉన్న వారు.. ఇలా భూపందేరం చేశారా.. అని ప్రశ్నించారు కూడా. రాజధానిలో కచ్చితంగా ఇన్ సైడర్ ట్రేడింగ్ జరిగిందనడానికి అంత కన్నా పెద్ద సాక్ష్యం ఏముంటుందని ప్రశ్నించారు. దీనిపై.. బాలకృష్ణ అల్లుడు.. బొత్స చెప్పిన వియ్యంకుడి కుమారుడు… శ్రీభరత్.. ప్రెస్ మీట్ పెట్టి.. అసలు వివరాలు వెల్లడించారు. ప్రభుత్వం తమకు 2007లోనే భూములు కేటాయించిందని పత్రాలు బయట పెట్టారు. అంతే కాదు.. మంత్రి బొత్స సత్యనారాయణ చూపించిన జీవో.. ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు… విడుదయిలందన్నారు.
కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్ లో మంత్రిగా బొత్స సత్యనారాయణ ఉన్నప్పుడే… ఆయన ఉన్న కేబినెట్ సమావేశమే… తమకు గ్యాస్ పవర్ ప్లాంట్ కోసం భూములు కేటాయించిందని.. ఆధారాలు మీడియాకు ఇచ్చారు. అదే సమయంలో.. భూములు కేటాయించినా.. కేబినెట్ నిర్ణయం తీసుకున్నా.. ఇంత వరకూ.. తన చేతికి ఆ భూములు రాలేదని.. న్యాయపరమైన వివాదాలున్నాయని స్పష్టం చేశారు. అప్పట్లో ప్రభుత్వం తమకు కేటాయించిన భూములు అమరావతి, విజయవాడ నుంచి సుమారు 100కి.మీల దూరంలో ఉన్నాయని, రాష్ట్ర విభజనకు ముందే ఈ భూముల కేటాయింపు జరిగిందని, అప్పట్లోనే ఎంఓయూపై సంతకాలు చేసినట్టు తెలిపారు.
తన పెళ్లికి ఆరేళ్ల ముందు జరిగిన దానిని పెళ్లయిన తర్వాత వ్యవహారాలకు కలపి.. రాజధానిని .. తరలించేందుకు.. చంద్రబాబుపై బురద చల్లేందుకు వాడుకుంటున్నారని.. మండిపడ్డారు. బొత్స …చాలా వివరాలు బయట పెట్టినట్లుగా.. ప్రెస్ మీట్ లో ఆరోపణలు చేశారు.. అయితే.. అమరావతిలో ఉన్న భూముల వివరాలు కాకుండా.. వందల కిలోమీటర్ల అవతల టీడీపీ నేతలకు ఉన్న వివరాలు బయట పెడుతున్నారు. దీంతో.. వారు కూడా కౌంటర్ ఇస్తున్నారు.