భరత్ అనే నేను సినిమాపై రోజు రోజుకీ నమ్మకాలు పెరుగుతున్నాయి. టీజర్ వచ్చాక.. ఒక్కసారి అంచనాలు ఆకాశాన్ని తాకేశాయి. అయితే చిత్రబృందంలో అందరి కంటే కొరటాల శివ అందరికంటే ఎక్కువగా ఈ కథని నమ్మాడు. అందుకే దర్శకుడిగానే పరిమితం కాలేదు. పంపిణీ రంగంలోనూ పాలు పంచుకున్నాడు. కృష్ణా, గుంటూరు, వైజాగ్ హక్కుల్ని కొరటాల శివ తన దగ్గరే ఉంచుకున్నాడు. అయితే ఇప్పుడు వైజాగ్‌ని కొరటాల వదిలేశాడని టాక్. అదీ… నిర్మాత డి.వి.వి. దానయ్య కోరిక మేరకే.
ప్రతీ నిర్మాణ సంస్థకూ కొంతమంది అలవాటైన పంపిణీదారులు ఉంటారు. డి.వి.వి కీ వైజాగ్‌లో కాంతి పిక్చర్స్ అనే పంపిణీ సంస్థతో మంచి అనుబంధం ఉంది. దానయ్య సినిమాలన్నీ వాళ్లే విడుదల చేస్తారు. అందుకే.. అలవాటైన వాళ్ల కోసం… వైజాగ్ హక్కుల్ని వదిలేయమని దానయ్య కోరాడట. అలా.. కొరటాల వైజాగ్ రైట్స్‌ని వదులుకున్నాడని తెలుస్తోంది. మహేష్‌బాబు కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం ఏప్రిల్ 20న విడుదల కానుంది.